ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఆధ్వర్యంలో పత్రికారంగ లబ్ధప్రతిష్టులకు ఘన సత్కారాలు
ఫిబ్రవరి 5న నాగార్జున యూనివర్సిటీలో అవార్డుల ప్రధానోత్సవం
ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సౌజన్యంతో
త్వరలో ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర సాహితీ సదస్సులు, గోదావరి సాహితీ వైభవ సదస్సుల నిర్వహణ
తెలుగు భాషారత్న సాఫల్య, తెలుగు భాష సేవారత్న పురస్కారాల అందజేత
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ అధ్యక్షలు పి. విజయ్ బాబు
విజయవాడ : గిడుగు రామ్మూర్తి ఆశయాలకు అనుగుణంగా వ్యవహారిక భాషకు పట్టం కడుతూ ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సౌజన్యంతో పత్రికారంగంలో నిష్ణాతులైన కొందరిని తెలుగు భాష సేవారత్న పురస్కారాలతో సత్కరించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ అధ్యక్షులు పి. విజయ్ బాబు తెలిపారు. తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం (ఏపీఎన్ఆర్టీఎస్) కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ అధ్యక్షులు పి. విజయ్ బాబు మాట్లాడుతూ పత్రికా రంగ రచయితలను సముచితంగా గౌరవించుకోవటంలో భాగంగా ఫిబ్రవరి 5న పత్రికా రచయితల ఆణిముత్యాలను ఘనంగా సత్కరించుకోనున్నట్లు చెప్పారు. పాలనావసరాల కోసం, భాషా సంస్కృతుల పరిపుష్టికి తెలుగు భాష, ప్రపంచీకరణ నేపథ్యంలో రేపటి తరం భవిత కోసం ఆంగ్ల భాష అన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి భావాలకు అనుగుణంగా ఏపీ అధికార భాషా సంఘం కృషి చేస్తున్నదని విజయ్ బాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిడుగు రామ్మూర్తి వారోత్సవాలు, వేమన శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ అధ్యక్షులు పి. విజయ్ బాబు తెలిపారు. అలాగే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, అల్లూరి శత జయంతి వేడుకలు, గుర్రం జాషువా జయంతి ఉత్సవం, శంకరంబాడి సుందరాచార్య జయంతి, పొట్టి శ్రీరాములు జయంతులతో పాటు టీవీ యాంకర్లకు తెలుగు తెలుగు గళ ప్రతిభా పురస్కారాలు వంటి వివిధ కార్యక్రమాల ద్వారా లబ్దప్రతిష్టులైన సాహితీమూర్తులను, అదేవిధంగా టీవీ, రేడియో స్వర మాంత్రికులను ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తరుపున పురస్కారాలతో ఘనంగా సత్కరించాం. జనవరి 9న అనంతపురం జిల్లాలో అత్యంత వైభవంగా అనంత తెలుగు భాషా వైభవ సదస్సు ను నిర్వహించి 90 మంది సాహితీస్రష్టలు, కవులు, కళాకారులను సత్కరించామని చెప్పారు. విస్తృత స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రోత్సహిస్తున్న మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ అధ్యక్షులు పి. విజయ్ బాబు అభినందనలు తెలిపారు. ఉత్రరాంధ్ర సాహితీ సదస్సు, దక్షిణాంధ్ర సాహితీ సదస్సు, గోదావరి సాహితీ సదస్సులను కూడా త్వరలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ అధ్యక్షలు పి. విజయ్ బాబు తెలిపారు. అలాగే ధార్మిక సదస్సు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. టీవీ యాంకర్లకు గళ ప్రతిభా పురస్కారాలు అందించామని, అదేవిధంగా తెలుగు భాష మీద మంచి పట్టు ఉన్న మీడియా రంగ రచయితలకు పురస్కారాలు ప్రదానం చేయాలనే వినూత్న ఆలోచనకు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం శ్రీకారం చుట్టిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్ర తెలుగు సంఘం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సౌజన్యంతో ఫిబ్రవరి 5న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆవరణలోని డైక్ మెన్ హాల్ లో తెలుగు భాష సేవారత్న పురస్కారాలు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తెలుగు భాష సేవారత్న పురష్కారాల్లో భాగంగా 20 మందిని తెలుగు భాషారత్న జీవన సాఫల్య పురస్కారాలతో, పత్రికా రంగంలో మరికొంత మందిని కూడా తెలుగు భాష సేవారత్న పురస్కారాలతో సత్కరించనున్నామని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ అధ్యక్షలు పి. విజయ్ బాబు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం(ఏపీఎన్ఆర్టీఎస్) ప్రెసిడెంట్ వెంకట్ ఎస్. మేడపాటి, సీఈవో పి. హేమలత రాణి, తెలుగు అధికార భాష సంఘ సభ్యులు జి. రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.