సమాజంలో అసమానతలు పోవాలంటే మరొకసారి వైసీపీ ప్రభుత్వం రావాలి
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
పేద, బడుగు బలహీన వర్గాలకు పెత్తందార్లకు మద్య జరుగుతున్న పోరాటమే 2024 ఎన్నికల సంగ్రామం
పేదలను ధనిక వర్గాలతో సమానం చేసేందుకు కృషి చేస్తున్న జగన్ కు ప్రజలు అండగా నిలవాలి
వైసీపీ ఎంపి విజయ సాయిరెడ్డి
చిలకలూరిపేట : రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర చరిత్రాత్మకమైనదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. చిలకలూరిపేటలో ఆయన మంత్రి విడుదల రజని, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, కుంభ రవిబాబులతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. సమాజంలో అసమానతలు
పోవాలంటే మరొకసారి వైసీపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యున్నతికి నిరంతరం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శ్రమిస్తున్నారని చెప్పారు. 2024 ఎన్నికల సంగ్రామం పెత్తందారులుకు, పేద, బడుగు బలహీన వర్గాలకు మధ్య జరుగుతున్న పోరాటమేనని అన్నారు. పేదలను ధనిక వర్గాలతో సమానం చేసేందుకు కృషి చేస్తున్న జగన్ కు ప్రజలు అండగా నిలవాలని కోరారు.
ఈ ఐదేళ్లలో చేసిన దానికి మించి.. వచ్చే ఐదేళ్లలో ఎన్నో మంచి పథకాలు అమలు చేయనున్నారని ఆయన చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చిలకలూరిపేట వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా మల్లెల రాజేశ్ నాయుడు అని స్పష్టం చేశారు. విడదల రజనీకి 2019లో ఏ విధంగా సహకారం అందించారో ఆదేవిధంగా ఇప్పుడు రాజేష్ ని కూడా సహకరించాలని కోరారు.
చంద్రబాబుపై చట్ట ప్రకారం కేసులు నమోదయ్యాయని, కోర్టులో విచారణ కొనసాగుతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు చేసిన ద్రోహం క్షమించరానిదన్న ఆయన ఆ పార్టీ చరిత్ర పుటల్లోకి చేరిపోయిందని, దానికి ఏపీలో భవిష్యత్తు లేదని తెలిపారు. ఏపిని విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని ఇప్పటి తరమే కాదు రాబోయే తరం కూడా క్షమించదని విజయసాయిరెడ్డి అన్నారు.