విజయవాడ : కృష్ణా నదిలో గల్లంతైన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. విజయవాడ పడమటకు చెందిన 8వ తరగతి విద్యార్థులు నడుపల్లి నాగసాయి కార్తికేయ, కత్తి ప్రశాంత్, ఇంటర్ సెకండియర్ చదువుతున్న గగన్ ఆదివారం మధ్యాహ్నం నదిలో ఈతకు దిగారు. వీరితో పాటు వచ్చిన కానూరుకు చెందిన ఎస్కే షారూక్ ఒడ్డున ఉన్నాడు. అతని కళ్ల ముందే ముగ్గురూ నీళ్లలో మునిగి చనిపోయారని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు.