ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారులసంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర రాజు
విజయవాడ : వీఆర్వోలపై అధికారులు ఒత్తిడి చేసి ఇబ్బందులకు గురిచేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారులసంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఎం అప్పలనాయుడు. తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే అనేక రకమైన విధులతో వీఆర్వోలు తీవ్ర పని ఒత్తిడితో ఎప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉంటున్నారు. ఎందుకంటే ప్రాధాన్యత పరంగా కాకుండా అన్ని పనులు ఒకేసారి చేయాలని అధికారులు ఆదేశాలు ఇవ్వడం, దాంతో విఆర్వోలు మానసిక ఇబ్బందులకు గురవటం జరుగుతుందన్నారు. ఇప్పటికే సచివాలయ వ్యవస్థలో నూటికి 90% విధులు విఆర్ఓలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం 30లక్షల పట్టాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయాలని దానిలో విఆర్వోలను ప్రభుత్వ ప్రతినిధిగా చేరుస్తూ జీవో నెంబర్ 36 ఇవ్వడం జరిగిందన్నారు. సిసిఎల్ఏ ఉన్నతాధికారులు వెంటనే ఈ ప్రక్రియ 29 నుండి పది రోజుల్లో పూర్తి చేయాలని అప్పటివరకు విఆర్వోలకు ఇతర విధులు చెప్పొద్దని సి సి ఎల్ ఏ ఉన్నత అధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చినా చాలా జిల్లాల్లో రి సర్వేకు సంబంధించి పనులు, ఇతర పనులు చేయాలని లేకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని వీఆర్వోలను కొన్ని జిల్లాల్లోచాలా దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెందుర్తిలో ప్రభుత్వ భూములకు సంబంధించి కొంతమంది భూకబ్జాలకు పాల్పడుతూ ఉంటే అవి కాపాడలేకపోతున్నారని, వీఆర్వోలపై క్రిమినల్ కేసులు పెట్టాలని జిల్లా అధికారులు ఆదేశాలు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో కొంతమంది, ఎంతో విలువైన స్థలాలను ఆక్రమించడం జరుగుతుందని, అటువంటి విషయాల్లో ఉన్నత అధికారులు కేవలం వీఆర్వోలపై బాధ్యత పెట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఖరీదైన భూములు కబ్జా చేస్తుంటే దానికి ప్రజా ప్రతినిధుల సహకారం ఉంటే వీఆర్వోలు ఏం చేయగలరని, ఆ ఖరీదైన స్థలాలు కాపాడాలంటే మండల, డివిజన్, జిల్లాస్థాయి అధికారులు పోలీసు అధికారుల ప్రొడక్షన్ తో అందరూ కలిపి కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇటువంటి విషయాల్లో కేవలం విఆర్ఓ లను బాధ్యులు చేస్తూ క్రిమినల్ కేసులు పెట్టాలని వైజాగ్ జిల్లా అధికారులు ఆదేశాలు ఇవ్వడం చాలా దుర్మార్గమన్నారు. పలు జిల్లాల్లో ఇలాగే అధికారులు అతిగా వ్యవహరించడం జరుగుతుందనీ, అధికారులు ఇలాగే వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా విఆర్వోలు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ విషయాలపై ఉన్నతాధికారులు అన్ని జిల్లాల అధికారులకు ఇళ్లస్థలాల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేవరకు వీఆర్వోలకు ఇతర విధులు ఏమీ చెప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.