మానవత్వం చాటుకున్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీని గంటలో పరిష్కారం చూపారు.
తొమ్మిది మంది అర్జిదారులకు తొమ్మిది లక్షల రూపాయల చెక్కులను అధికారులు
పంపిణీ చేశారు. ఆర్డీవో కార్యాలయంలో సదరు 9 మంది అర్జి దారులకు లక్ష రూపాయలు
చొప్పున చెక్కులను కలెక్టర్ ప్రశాంతి అందజేశారు.
చెక్కులు అందుకున్న వారి వివరాలు : కడలి నాగలక్ష్మి, తండ్రి కడలి సత్యనారాయణ,
ఎల్ బి చర్ల గ్రామం, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా, భూ పరిష్కారంలో
పరిహారం అందజేశారు. ఎల్లమల్లి అన్నపూర్ణ, 29వ వార్డు, నరసాపురం మండలం,
పశ్చిమగోదావరి జిల్లా భర్త చనిపోవడంతో ఆర్థిక సహాయం అందించారు. చిల్లి సుమతి,
బోడ్డి పట్ల గ్రామం, ఎలమంచిలి మండలం, పశ్చిమగోదావరి జిల్లా బాబుకు కిడ్నీ
ఇన్ఫెక్షన్ ఆర్థిక సహాయం అందించారు. కంతేటి దుర్గ భవాని, వైఫ్ ఆఫ్ నాగ వెంకట
రవితేజ, శ్రీరామవరం, దెందులూరు మండలం, ఏలూరు జిల్లా వైద్య సహాయం నిమిత్తం
అందించారు. తేతలి గీత, వైఫ్/ఆఫ్ లేట్ టి ఎస్ ఎస్ ఎన్ రెడ్డి, ఫైర్ స్టేషన్
సెంటర్, ఏలూరు, ఏలూరు జిల్లా భర్త మరణించడం వల్ల ఆర్థిక సహాయం అందించారు.
అరుగుల లాజరస్, పూళ్ళ గ్రామం, భీమడోలు మండలం, ఏలూరు జిల్లా కుమారునికి వైద్య
సహాయం నిమిత్తం అందించారు. గుడాల అపర్ణ జ్యోతి, తిరుపతి పురం, అత్తిలి,
పశ్చిమగోదావరి జిల్లా. వైద్య సహాయం నిమిత్తం అందించారు.