– 1.70 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లతో పేదలకు ప్రాథమిక వైద్య సేవలు
– వైద్య రంగ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్రిటికల్ కేర్
బ్లాక్‌లు
– ఇంటిగ్రేటెడ్ ప్రజారోగ్య ల్యాబ్‌లతో ఆరోగ్య మౌలిక వసతులు బలోపేతం
– ఆరోగ్య రంగ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ క్రియాశీలత, ప్రగతి భేష్
కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్
మాండవీయ
ఎన్టీఆర్ జిల్లా : మారుమూల ప్రాంతంలో చిట్టచివరి వ్యక్తికీ..పేదలందరికీ
నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు గౌరవ భారత ప్రధానమంత్రి నేతృత్వంలో
కేంద్ర ప్రభుత్వం దేశ ఆరోగ్య రంగ అభివృద్ధికి సమ్మిళిత, సమగ్ర విధానాన్ని
అనుసరిస్తోందని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల శాఖ
మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య
మౌలిక వసతుల మిషన్ (పీఎం అభిమ్) కింద రూ. 23.75 కోట్ల చొప్పున వ్యయంతో
ఎన్టీఆర్, అనకాపల్లి జిల్లాలకు మంజూరైన క్రిటికల్ కేర్ బ్లాక్‌ల
శంకుస్థాపనతో పాటు రూ. 1.25 కోట్ల చొప్పున వ్యయంతో పశ్చిమగోదావరి,
ప్రకాశం, విజయనగరం, గుంటూరు, కృష్ణా, అన్నమయ్య, శ్రీకాకుళం
జిల్లాల్లోని ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటుచేసిన ఏడు సమీకృత
ప్రజారోగ్య లేబొరేటరీలు (ఐపీహెచ్ఎల్) ప్రారంభోత్సవం, రూ. 30 కోట్లతో
ఏర్పాటయ్యే బయో సేఫ్టీ లెవెల్-3 లేబొరేటరీకి శంకుస్థాపన కార్యక్రమం
శుక్రవారం విజయవాడలోని ఓల్డ్ జీజీహెచ్‌లో జరిగింది. రాష్ట్ర వైద్య,
ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని; విజయవాడ, అనకాపల్లి ఎంపీలు కేశినేని
శ్రీనివాస్, డా. బి.వెంకట సత్యవతి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితర
ప్రజాప్రతినిధులతో పాటు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ
పి.అశోక్‌బాబు, రాష్ట్ర వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కమిషనర్ జె.నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ
డి.మురళీధర్‌రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
తదితరులతో కలిసి కేంద్ర మంత్రి మాండవీయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఫొటో
ప్రదర్శనను తిలకించిన అనంతరం శిలాఫలకాలను ఆవిష్కరించారు.
జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాండవీయ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య
సేవలు అందించడంలో కీలకపాత్ర పోషించే ఆరోగ్యరంగ మౌలిక వసతులకు
శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా
ఉందన్నారు. ఆరోగ్యవంతులైన మనుషుల ద్వారా ఆరోగ్యకర సమాజ నిర్మాణం
జరుగుతుందని.. తద్వారా ఆరోగ్యకర, అభివృద్ధి చెందిన దేశం
సాకారమవుతుందన్నారు. అందుకే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ
ఆరోగ్యరంగ అభివృద్ధికి, నవ భారత నిర్మాణానికి సమగ్ర విధానాలతో
కృషిచేస్తున్నారన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది మందికి ఆరోగ్య
భద్రత లభిస్తోందని.. పీఎం జన్ ఆరోగ్య యోజనతో రూ. 5 లక్షల బీమాతో
పేదలకు ఆరోగ్య ధీమా లభిస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా 1.70 లక్షల
ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ప్రాథమిక ఆరోగ్య, స్వాస్థ్య సేవలు
అందిస్తున్నాయన్నారు. పెద్ద అనారోగ్య సమస్యలకు సైతం ప్రాథమికంగా
పరీక్షలు చేసే ఏర్పాట్లు ఇందులో ఉన్నట్లు తెలిపారు. 10 రకాల పరీక్షలు ఈ
వెల్నెస్ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయన్నారు. కేవలం ఆసుపత్రులు ఉంటే
సరిపోదని.. వైద్యులు కూడా అవసరం మేరకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో
వైద్య రంగ మానవ వనరుల అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. 67 ఏళ్ల
కాలంలో 350 వైద్య కళాశాలలు ఉంటే ఆ సంఖ్య 9 ఏళ్లలోనే 707కు చేరిందని
తెలిపారు. 54 వేలు ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య లక్షా ఏడువేలకు చేరిందన్నారు.
వ్యయ ప్రయాసలు లేకుండా పేదలకు స్పెషలిస్టు వైద్య సేవలు: ఢిల్లీ నుంచి
హర్యానా మార్గమధ్యంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నుంచి ఓ సీహెచ్‌సీ డాక్టర్
చండీగఢ్ పీజీఐ స్పెషలిస్టు డాక్టర్‌ను టెలీ కన్సల్టేషన్ ద్వారా
సంప్రదించి.. రోగికి వైద్యం అందించే విధానాన్ని ప్రత్యక్షంగా
పరిశీలించానని.. పేదలకు వ్యయ, ప్రయాసలు లేకుండా అందుతున్న ఇలాంటి
సేవలు, ఘటనలు ఎంతో సంతృప్తినిస్తున్నట్లు పేర్కొన్నారు. నేడు రోజుకు మూడు
నుంచి నాలుగు లక్షల వరకు టెలీ సేవలు అందించే స్థాయికి వ్యవస్థ
పురోగమించిందన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఎక్కడికక్కడ క్రిటికల్ కేర్
బ్లాక్‌ల (సీసీబీ) అవసరం ఏర్పడిందని.. అత్యవసర, సర్జికల్,
ఇంటెన్సివ్ కేర్ సేవలకు వీలుకల్పించేలా దేశ వ్యాప్తంగా వైద్య
కళాశాలలు/జిల్లా ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఐసీయూ వెంటిలేటర్, ఐసోలేషన్ వార్డు వంటివి ఇందులో ఉంటాయన్నారు. అదే విధంగా
బ్లాక్, జిల్లా, రీజియన్.. ఇలా జాతీయ స్థాయి వరకు ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు
వ్యాధి నిర్ధారణ.. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా కొత్త వైరస్లు, వ్యాధుల
గుర్తింపునకు వీలుంటుందని.. ఈ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్
లేబొరేటరీలు (ఐపీహెచ్ఎల్ఎస్) ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరోగ్య రంగ అభివృద్ధి చేస్తున్న కృషి అభినందనీయమని
కేంద్ర మంత్రి మాండవీయ కొనియాడారు. సమాఖ్య స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్రాల
మధ్య సత్సంబంధాలతో ప్రజారోగ్య రంగ అభివృద్ధికి కృషిచేస్తూ పథకాలు,
కార్యక్రమాల అమల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తూ ప్రగతి పథంలో
పయనిస్తోందంటూ అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ
ఆరోగ్య రంగ పనుల మంజూరుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని చేసిన
కృషి అభినందనీయమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ
పేర్కొన్నారు.
**
రాష్ట్ర ఆరోగ్య రంగ మౌలిక వసతుల్లో మైలురాయి : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ
మంత్రి విడదల రజని
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని మాట్లాడుతూ కేంద్ర
ప్రభుత్వ సహకారంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ
చేతులమీదుగా రాష్ట్ర వైద్య రంగ మౌలిక వసతులను బలోపేతం చేసే క్రమంలో
శుక్రవారం రెండు క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు, ఒక బీఎస్ఎల్-3 లేబొరేటరీకి
శంకుస్థాపన చేసుకోవడం.. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ఇంటెగ్రేటెడ్
పబ్లిక్ హెల్త్ లేబొరేటరీలను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రూ. 350.25 కోట్లతో మొత్తం 14 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు
అందుబాటులోకి వస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 16.25
కోట్లతో 13 సమీకృత ప్రజారోగ్య లేబొరేటరీలను అభివృద్ధి చేసుకుంటున్నట్లు
తెలిపారు. వైద్య రంగంలో ఇలాంటి అత్యాధునిక వసతులను అందుబాటులోకి
తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి రాష్ట్ర
ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు
పేర్కొన్నారు. పీఎం-అభిమ్ ద్వారా రాష్ట్రానికి రూ. 1271.24 కోట్లు మేర
కేటాయింపులు జరిగాయని.. రాష్ట్ర ఆరోగ్య రంగ మౌలిక వసతులపై చూపుతున్న
నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. ఆరోగ్య రంగంలో ఎదురయ్యే సవాళ్లను
ఎదుర్కొనేందుకు బీఎఎస్ఎల్-3 ల్యాబ్‌లు దోహదం చేస్తాయన్నారు. దేశ వ్యాప్తంగా
పది ల్యాబ్‌లు మంజూరు చేస్తే వాటిలో ఒక ల్యాబ్‌ను రాష్ట్రానికి మంజూరు
చేసినందుకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు
తెలియజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్
రెడ్డి గారు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం
చేసేందుకు అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ఎంతో కృషిచేస్తున్నారని
పేర్కొన్నారు. రూ. 1,692 కోట్లతో ఏర్పాటుచేసిన 10,032 విలేజ్ ఆయుష్మాన్
ఆరోగ్య మందిర్లు ఆరోగ్య సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు.
ఆరోగ్యరంగ వృత్తి నిపుణులను అందించేందుకు రూ. 8,480 కోట్ల పెట్టుబడితో 17
కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటుచేస్తున్నట్లు వివరించారు. రూ. 25 లక్షల
వరకు ఉచితంగా వైద్య సేవలు అందించే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని
అమలుచేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారానికి, రాష్ట్ర
ముఖ్యమంత్రి నేతృత్వం, దార్శనికత తోడై ప్రజలకు నాణ్యమైన సమగ్ర ఆరోగ్య
సంరక్షణ సేవలు అందించే దిశగా రాష్ట్రం పయనిస్తుందని పేర్కొన్నారు.
భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత్
భారత్ సంకల్ప సిద్ధి దిశగా డైనమిక్ లీడర్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్
జగన్ మోహన్ రెడ్డిగారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తోందని
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు.
*
పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని ) మాట్లాడుతూ పేద ధనిక అనే
తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి అనారోగ్యం అనేది పెద్ద సమస్య అని.. కోవిడ్
అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు
తీసుకుంటున్నారన్నారు. దీనిలో భాగంగా ప్రతి పేదవాడికి ఆరోగ్య సేవలు ఉచితంగా
అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ధ్యేయం అన్నారు. అత్యాధునిక
వైద్య సౌకర్యాలు అందుబాటులో భాగంగా క్రిటికల్ కేర్ యూనిట్లు ఏర్పాటు
దేశవ్యాప్తంగా జరుగు తున్నాయన్నారు. దీనిలో భాగంగా విజయవాడ నగరంలో 23 కోట్ల
నిధులతో పాత ప్రభుత్వ ఆసుపత్రి లో క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటుకు నిధులు
మంజూరు చేయడం పట్ల పార్లమెంట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త ప్రభుత్వ
ఆసుపత్రిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చిన రూ. 150 కోట్ల నిధులతో
నిర్మించిన మల్టీ స్పెషాలిటీ బ్లాక్ కోవిడ్ సమయంలో ఎంతో ఉపయోగపడిందన్నారు.
సుమారు 18 ఎకరాల్లో 2 వేల కోట్ల రూపాయల నిధులతో మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్
ద్వారా ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని పార్లమెంట్ సభ్యులు కేశినేని
నాని అన్నారు.
రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్
మాట్లాడుతూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వైద్య రంగం పట్ల ప్రత్యేక
శ్రద్ధ తీసుకోవడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు -నేడు కార్యక్రమము
ద్వారా ప్రతి పేదవానికి అత్యాధునిక వైద్య సేవలు అందించే వసతులను
అందుబాటులోకి తీసుకువచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రెండంతస్తులలో 24
కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం జరుపుకుంటున్న క్రిటికల్ కేర్ యూనిట్ ను ఐదు
అంతస్తుల లో నిర్మించి విస్తరిస్తే పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు
అందుబాటులోకి వస్తాయని శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ కేంద్ర మంత్రి
దృష్టికి తీసుకువచ్చారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు
మాట్లాడుతూ ప్రైమ్ మినిస్టర్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్
ద్వారా రోగ నిర్ధారణ సేవలతో పాటు చికిత్సకు సంబంధించిన అత్యాధునిక వైద్య
సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం ప్రధాన ఉద్దేశం అన్నారు. కోవిడ్ అనంతరం
భవిష్యత్తులో ఆరోగ్యం పరంగా ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు కేంద్ర
ప్రభుత్వం దేశ వ్యాప్తంగా క్రిటికల్ కేర్ బ్లాక్స్ ఏర్పాటు చేస్తుందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ. 350.25 కోట్ల రూపాయల నిధులతో ఏర్పాటవుతున్న 14
క్రిటికల్ కేర్ బ్లాక్‌లతో పాటు ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబరేటరీస్
(ఐపిహెచ్ఎల్ఎస్), బయో సేఫ్టీ లెవెల్ 3 లాబరేటరీలతో రాష్ట్రంలో ప్రజలందరికీ
అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని స్పెషల్ సీఎస్ కృష్ణబాబు
అన్నారు.
కార్యక్రమంలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. డీఎస్‌వీఎల్ నరసింహం,
సబ్ కలెక్టర్ అదితి సింగ్,
డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. డి.వెంకటేష్,
వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు.