విజయవాడ : అధికారం కోసం అవాస్తవాలు చెప్పడం, ముఖ్యమంత్రి అయ్యాక
కక్షసాధింపులు,దోపిడీలకు పాల్పడటం. ఇదీ జగన్ రెడ్డి నైజం అని టీడీపీ పొలిట్
బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అధికారం కోసం జగన్ రెడ్డి
ప్రజలకు చెప్పిన అవాస్తవాలకు ప్రతిరూపమే టీడీపీ విడుదలచేసిన పుస్తకం. అలానే
సాక్షి టీవీలో ప్రసారమైన జగన్ రెడ్డి హామీల తాలూకా వీడియో క్లిప్లింగ్స్ ను
కూడా ప్రజలముందుకు తీసుకొచ్చాం. మరో 3 నెలల్లో జగన్ రెడ్డి ఇంటికెళ్లడం ఖాయం.
ఈ నేపథ్యంలో మోసకారి జగన్ రెడ్డి మాటలు, హామీలు ప్రజలకు గుర్తుచేయడానికే
టీడీపీ ఈ పుస్తకాన్ని విడుదలచేసింది. కేవలం అధికారం కోసమే భారతదేశంలో ఏ రాజకీయ
నాయకుడు ఇవ్వనన్ని హామీలు జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చాడు. అధికారం చేతికందగానే
కక్షసాధింపులు, దోపిడీయే ధ్యేయంగా ముందుకు సాగుతున్నా డు. మూడు రాజధానులంటూ
మూడుముక్కలాట ఆడి, విశాఖపట్నంలో వేలకోట్ల విలువైన భూములు కొట్టేశాడు. జాబ్
క్యాలెండర్ , ప్రత్యేకహోదా పేరుతో యువత, నిరుద్యోగుల్ని వంచించాడు. చివరకు
అవినీతి, దోపిడీతో పారిశ్రామిక వేత్తల్ని భయపెట్టి, రాష్ట్రంలోని
పరిశ్రమలుకూడా పొరుగురాష్ట్రాలకు తరలిపోయే ట్టు చేశాడు. ఇసుక దోపిడీతో
భవనిర్మాణ కార్మికులు సహా, వివిధ రంగాల కార్మికుల పొట్టకొట్టాడు. ఇంత మోసకారీ
ముఖ్యమంత్రి భారతదేశంలో మరెవరూ ఉండరు. జగన్ రెడ్డి మోసాలు, అబద్ధాలు ప్రజలకు
తెలియచేసి, అతనిచ్చిన హామీలను జనం ముందు ఉంచి, అతని బాగోతం బట్టబయలు చేస్తామని
ని బొండా ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు.
జగన్ రెడ్డి మేనిఫెస్టో అంతా పచ్చి బూటకం
టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య
గుంటూరు : మద్యపాన నిషేధమని మహిళల్ని నమ్మించి వారి ఓట్లు దండుకున్న జగన్
రెడ్డి, చివరకు మద్యపాన సేవనం పెంచి 30లక్షల మంది పేదల్ని ఆసుపత్రుల
పాలుచేశారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య అన్నారు. మద్యపాన
నిషేధం సంపూర్ణంగా చేశాకే ఓట్లు అడగడానికి మీ ముందుకు వస్తానని జగన్మోహన్
రెడ్డి గతంలో అన్నది నిజం కాదా? అలా చెప్పిన వ్యక్తి ఈ 4 ఏళ్ల 8 నెలల్లో
మద్యపాన సేవనాన్ని పెంచాడు. తన ధనదాహంతో మహిళల పుస్తెలు తెంచాడు. చివరకు జగన్
రెడ్డి నిర్వాకంతో తాగుబోతులు మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటివరకు
రూ.2.50 లక్షల కోట్ల విలువైన కల్తీమద్యాన్ని జగన్ రెడ్డి విక్రయించారు. కేవలం
ఓట్లు దండుకొని అధికారంలోకి రావాలన్న ఉబలాటం తప్ప, జగన్ రెడ్డికి ప్రజల
యోగక్షేమాలు, సాదకబాధలు పట్టవని అర్థమైంది. జగన్ రెడ్డి అమ్ముతున్న
కల్తీమద్యంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది పేదలు ఆసుపత్రుల
పాలయ్యారు. ఇంత చేసిన ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకొని మహిళల ఓట్లు అడుగుతారు?
జగన్ రెడ్డి మేనిఫెస్టో అంతా పచ్చి బూటకం. అబద్ధాల పుట్ట, ఇక ఆయన్ని, ఆయన
ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మేస్థితిలో లేరని రామయ్య తేల్చిచెప్పారు.
జగన్ ఎంత మోసకారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ.జనార్థన్
అమరావతి : తెలుగుదేశం పార్టీ నేడు విడుదలచేసిన ఈ పుస్తకంలో జగన్ రెడ్డి
హామీలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన అంశాలనే పొందుపరిచామని టీడీపీ
పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ.జనార్థన్ అన్నారు. నియోజకవర్గాల వారీగా
రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్లలో 102 సభల్లో జగన్ రెడ్డి చెప్పిన అంశాలు,
వివిధ సందర్భాల్లో ఎక్కడికక్కడ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా త్వరలోనే
జనంలో ఎండగడతాం. రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ జగన్ రెడ్డి ఎంత మోసకారో
తెలుసుకోవాలని జనార్థన్ సూచించారు.