సంక్షేమ పథకాల సారధి సీఎం జగన్ : ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
ప్రజల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తి జగనన్న : ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు
దేశంలోనే అత్యధిక పింఛన్ అందిస్తున్న సీఎం జగన్ : ఎమ్మెల్యే అనిల్‌కుమార్
యాదవ్
రాయచోటిలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర
అన్నమయ్య జిల్లా : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి చేస్తోన్న మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన
సామాజిక సాధికార బస్సుయాత్ర విజయవంతంగా సాగుతోంది. రాయచోటిలో గురువారం
మధ్యాహ్నం సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయచోటి
ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ బస్సు యాత్రలో
పలువురు మంత్రులతో పాటు ఇతర రాష్ట్ర స్థాయి నాయకులు హాజరయ్యారు. మధ్యాహ్నం
రింగ్‌రోడ్డు నుంచి బంగ్లా వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ ఏర్పాటు చేసిన
బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రజాప్రతినిధులు, నేతలు మాట్లాడారు.
బీసీల పేరు చెప్పుకుని చంద్రబాబు మోసం : డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ,
మైనార్టీల ఓట్లతో గెలిచి అన్యాయం చేశారని మండిపడ్డారు. 14 ఏళ్లు పని చేసిన
చంద్రబాబు టీడీపీ బీసీల పార్టీ అంటాడు. బీసీల పేరు చెప్పుకుని మోసం చేశాడు. మన
ఓట్లతో గెలిచి మనల్ని మోసం చేశారు. మోసం చేసిన చంద్రబాబు లాంటి వ్యక్తి
కావాలా? సామాజిక న్యాయం చేసిన సీఎం జగన్ కావాలా? అని ప్రశ్నించారు. మైనార్టీని
మంత్రి చేయని వ్యక్తి చంద్రబాబు. అదే సీఎం జగన్ నన్ను రెండు సార్లు
ఎమ్మెల్యేను చేసి డిప్యూటీ సీఎంను చేశాడు. రాయచోటికి చెందిన జకియా ఖానమ్‌ను
శాసన మండలి డిప్యూటి ఛైర్మన్‌ను చేశారు. చరిత్ర రాయాలంటే వైఎస్ కుటుంబానికే
సాధ్యమౌవుతుందన్నారు. సింహం వైఎస్ జగన్ సింగిల్‌గా వస్తారు. 175 స్దానాల్లో
వైఎస్సార్సీపీ గెలుస్తుంది. 175 స్దానాల్లో టీడీపీకి అభ్యర్దులు లేరు. మేము
ఏరిపారేస్తే వారికి టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారని డిప్యూటీ సీఎం
వ్యాఖ్యానించారు.
ఇదీ సీఎం జగన్ పాలన ఘనత : ఎంపీ నందిగం సురేష్
వైఎస్సార్ ఫ్యామీలిని నమ్మి మోసపోయిన వారు ఎవరు లేరని ఎంపీ నందిగం సురేష్
అన్నారు. చంద్రబాబును నమ్మి మోసపోయిన వారు ఎంతో మంది ఉన్నారన్నారు. వచ్చే
ఎన్నికల్లో ఈ తేడా చూసి వైఎస్సార్సీపీని గెలిపించండి. సీఎం వైఎస్ జగన్ కోసం
పోరాడే సైనికుడు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ఇప్పుడు మన పిల్లలు
ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతున్నారంటే ఇది సీఎం జగన్ పాలన ఘనత. కార్యాలయాల
చుట్టూ తిరగకుండా పథకాలు అందిస్తున్న వ్యక్తి జగన్ అని ఎంపీ సురేష్
పేర్కొన్నారు.
అత్యధిక పింఛన్ అందిస్తున్న సీఎం జగన్ : ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్
ఎవరూ ఊహించని రీతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సామాజిక సాధికారత పేరిట
రాజ్యాంగ పదవుల్లో కూర్చోపెట్టారని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు కేబినెట్లో పెద్దపీట వేశారు. రాజ్యాంగ పదవుల్లో
ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్లలో మేయర్లుగా, మునిసిపల్ చైర్మన్లుగా
కూర్చోబెట్టారు జగనన్న. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలకు డీబీటీ ద్వారా దాదాపు
రూ.2.4లక్షల కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారని ఎమ్మెల్యే అనిల్‌కు
మార్ యాదవ్ అన్నారు.
ప్రజల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తి జగనన్న : ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు
ముఖ్యమంత్రి జగనన్న కష్టాలు చూశారు. నష్టాలు చూశారు. బాధలు చూశారు. అందుకే ఆయన
ముఖ్యమంత్రి కాగానే ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అవి నేరుగా ప్రజలకు
చేరేలా చేశారని ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. ఈ
నాలుగున్నరేళ్లలో పేదలకు, మహిళలకు చేసిన మేలు అంతా ఇంతా కాదు. మహిళల ఆర్థిక
సాధికారతకోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని ఎమ్మెల్యే కొరుముట్ల
శ్రీనివాసులు అన్నారు.
సంక్షేమ పథకాల సారధి సీఎం జగన్ : ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పేదలకు మంచి జరగాలని అనేక సంక్షేమ
పథకాలు తీసుకొచ్చారని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సామాజిక సాధికార
యాత్ర లక్ష్యం ఈ నాలుగున్నరేళ్లలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు జగనన్న
వల్ల జరిగిన మేలును తలచుకోవడం. తెలుసుకోవడం. రాయచోటి నియోజకర్గానికే ఈ
నాలుగున్నరేళ్లలో పథకాల కోసం, అభివృద్ధి పనుల కోసం రూ.1289 కోట్ల ప్రయోజనం
కలిగించారని పేర్కొన్నారు.