థింక్ గ్లోబలీ..యాక్ట్ గ్లోబలీ..బెంగళూరు సభా వేదికగా చంద్రబాబు పిలుపు
బెంగళూరు : ప్రపంచంలోనే తెలుగువారు నంబర్‌వన్‌గా ఉండాలనేది తన ఆకాంక్షని
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోమారు స్పష్టం చేశారు. బెంగళూరులో
నిర్వహించిన టీడీపీ ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రైతు కుటుంబంలో పుట్టి
ఐటీని ప్రోత్సహించా. అప్పట్లో ఐటీ ఏర్పాటు చేస్తానన్నప్పుడు..విజన్-2020 అని
చెప్పినప్పుడు నన్ను హేళన చేశారు. వైసీపీ పాలనలో ఏపీలోని అన్ని వ్యవస్థలు
భ్రష్టుపట్టాయి. రానున్న ఎన్నికలు ఎందుకు ముఖ్యమనేది ప్రజలకు వివరించాలి.
పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవిత ఆశయం. పది మందికి ఉద్యోగం ఇచ్చే
స్థాయికి విద్యార్థులు ఎదగాలి. నన్ను మొదటిసారి గెలిపించింది విద్యార్థులే’
అని చంద్రబాబు చెప్పారు. అంతకుముందు బెంగళూరుకు చేరుకున్న చంద్రబాబు కుప్పం
నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు త్రిలోక్‌ను పరామర్శించారు. చంద్రబాబు అక్రమ
అరెస్టు సమయంలో కుప్పంలో ఆందోళన చేస్తున్న త్రిలోక్ ప్రమాదానికి గురయ్యారు.
తీవ్ర అనారోగ్యానికి గురైన త్రిలోక్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో
మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని వారికి చంద్రబాబు ధైర్యం చెప్పారు.
థింక్ గ్లోబలీ…యాక్ట్ గ్లోబలీ : బెంగళూరులో ప్రభావితం చేసే స్థాయిలో తెలుగు
ప్రజలు ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుఅన్నారు. గురువారం బెంగళూరులో
టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు.
వేలాది మంది తెలుగు ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ చీఫ్
మాట్లాడుతూ తనకు కష్టం వచ్చినప్పుడు అంతా అండగా నిలబడ్డారన్నారు. రైతు బిడ్డ
ఐటీలో ఎందుకు పనిచేయకూడదు అని ఆలోచన చేశానని, 30 సంవత్సరాల క్రితం చేసిన
ఆలోచనతో ఈ రోజు ఇంత మంది ఐటీ ఉద్యోగులుగా స్థిరపడ్డారన్నారు. ఐటీని డెవలప్
చేయాలంటే ఆ రోజు ఎగతాళి చేశారన్నారు. థింక్ గ్లోబలీ…యాక్ట్ గ్లోబలీ అని
చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎక్కడ ఉన్నా గ్లోబలీ పనిచేసే అవకాశం ఉందన్నారు.
పీ4 వ్యవస్థకు శ్రీకారం చుట్టాలి : ప్రపంచానికే నాయకత్వం ఇచ్చే అవకాశం భారత
దేశానికే ఉందన్నారు. 2047 సంవత్సరానికి భారత దేశం నెంబర్ వన్‌గా ఉంటుందని ధీమా
వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను కూడా కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు.
నవశఖం తెలుగువారి శఖం అవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే నంబర్
వన్‌గా తెలుగు ప్రజలు ఉండాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చారు. బెంగళూరు
టీడీపీ ఫోరంను చాలా పద్ధతిగా ఆర్గనైజ్ చేస్తున్నారన్నారు. ఆడపిల్లకు
చదువెందుకు అని అన్నారని, ఇప్పుడు ఆడపిల్లలు మగవారితో సమానంగా
ఎదుగుతున్నారన్నారు. ఆడపిల్లకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితి
వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని విమర్శించారు.
ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరికం లేని సమాజంను చూడాలన్నదే తన కోరికన్నారు. ఆర్థిక
అసమానతలు తగ్గించాలని దే లక్ష్యమని స్పష్టం చేశారు. పీ4 వ్యవస్థకు శ్రీకారం
చుట్టాలని.. పీ4 అంటే పబ్లిక్ ప్రయివేట్ పీపుల్ పార్టనర్ షిప్ అని టీడీపీ చీఫ్
చెప్పుకొచ్చారు.
బెంగళూరు టీడీపీ ఫోరంను కోరుతున్నా : ఆంధ్రప్రదేశ్‌ని బాగు చేసేందుకు మీరు ఏం
చేయగలరు ప్లాన్ చేయండి. వంద రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి. వచ్చే
ఎన్నికలు ఎందుకు ముఖ్యమో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. ఎన్నికల ప్రచారంలో
కూడా మీరు పాల్గొనాలి. మీరు సంపాదించే దానిలో 5 శాతం ఖర్చుపెట్టి సమాజం కోసం
ఖర్చు చేయండి. సమాజహితం కోసం మీరు కష్టపడాలి. నాకోసం కాదు నేను చేసే పనులు తర
తరాలు గుర్తుపెట్టుకోవాలి. చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటే నా జన్మ
దన్యమైనట్లే’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. బెంగళూరులో సమావేశం ముగిసిన అనంతరం
చంద్రబాబు కుప్పంకు బయలుదేరి వెళ్లారు.
బెంగళూరులో త్రిలోక్‌ను పరామర్శించిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు
త్రిలోక్‌ను చంద్రబాబు పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ సమయంలో
కుప్పంలో ఆందోళన చేస్తున్న సమయంలో త్రిలోక్ ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం
బెంగళూరులోని తన నివాసంలో త్రిలోక్ ఉంటున్నారు. ఈ క్రమంలో కాసేపటి క్రితమే
త్రిలోక్‌ను పరామర్శించిన చంద్రబాబు నాయిక తీవ్ర అనారోగ్యానికి గురైన త్రిలోక్
ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం
చెప్పారు. అక్కడి నుంచి బెంగళూరు టీడీపీ ఫోరం సమావేశంలో పాల్గొనేందుకు
చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. అంతకుముందు బెంగళూరు హెచ్ఎఎల్ విమానాశ్రయానికి
చేరుకున్న చంద్రబాబుకు నేతలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీలు కంచర్ల
శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, టీడీపీ నేత గురజాల జగన్మోహన్
చంద్రబాబు స్వాగతం పలికారు. విమానాశ్రయం వద్దకు భారీగా టీడీపీ అభిమానులు
చేరుకున్నారు.