విజయవాడ బ్యూరో : రాష్ట్ర ప్రజల స్థిరాస్తుల వివాదాలను పరిష్కరించే అధికారం
సివిల్ కోర్టులను తప్పించి రెవెన్యూ ట్రిబ్యునల్స్ కు అధికారాలు కట్టబెట్టే
భూహక్కుల చట్టాన్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి కెవివి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో
కె.వి.వి. ప్రసాద్ అధ్యక్షతన బుధవారం దాసరి భవన్లో ఏసీ ల్యాండ్ టైటిలింగ్
యాక్ట్ పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ
చట్టం నేపథ్యంలో ప్రపంచబ్యాంక్ ఆదేశాలమేరకు కార్పోరేట్ సంస్థలు భూ సేకరణకు
అనుకూలంగా నీతి ఆయోగ్ సూచనలమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం తెచ్చిందన్నారు.
రాష్ట్రంలో ఆ చట్టం అమలైతే భూ స్థిరాస్థి దారుల భూహక్కులు హరించబడతాయని ఆందోళన
వ్యక్తం చేశారు. రైతు సంఘం సీనియర్ నాయకులు వై. కేశవరావు మాట్లాడుతూ భూ హక్కుల
చట్టంలో ఉన్న అంశాలు పాతవని 1992, 2018లో ప్రభుత్వం చట్టాలు చేయటానికి
ప్రయత్నం చేయగా తప్పులు ఉన్నాయని రైతుసంఘాలు వ్యతిరేకించగా వెనక్కి
తగ్గారన్నారు. గతంలో 1977-78 సంవత్సరా లలో రైతు సంఘాలు పాస్ బుక్లు,
పట్టాలకోసం ఆందోళన చేపట్టగా 83లో ఎన్టీఆర్ ప్రభుత్వం చట్టం చేశారని తెలిపారు.
బెంగాల్, కేరళ ప్రభుత్వాలు కౌలుదారులకు అనుభవం పుస్తకం, యజమానులకు పుస్తకాలు
ఇచ్చి వీరికి అనుకూలంగా ఉన్నారన్నారు.
తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల
స్థిరాస్థులను కబ్జా చేయటానికే ఇలాంటి చట్టాన్ని ముఖ్యమంత్రి తెచ్చారని
మండిపడ్డారు. ప్రభుత్వం కొత్త కోణంలో దోపిడీ చేస్తుందని తెలిపారు. మూడు
చట్టాలకు తిరేకంగా జరిగిన ఉద్యమ స్ఫూర్తితో రైతాంగంలోకి వెళ్ళాలన్నారు.
వ్యతిరేక ప్రత్యేక హోదా సాధన కమిటీ కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ
ప్రజల ఆస్తులను కాజేసేందుకు రాష్ట్ర భుత్వం తెచ్చిన ఈ చట్టం రద్దు చేసే వరకు
ఉద్యమించాలన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కేబి సుందర్ మాట్లాడుతూ
ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా బార్ అసోసియేషన్ అండగా ఉంటుందన్నారు. బార్
అసోసియేషన్ సభ్యులు నామాల కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇల్లు,స్థలము, ఏదైనా రాబోయే
రోజుల్లో ఇది నాదేనా అని మీమాంస పడాల్సిన పరిస్థితి వస్తుందని, భూ హక్కుల
చట్టంలో 69 సెక్షన్లు అందులో కొన్ని 7.9.13,37, 46,64 వివాదంతో కూడుకొని,
యజమానులకు నష్టాలను కలిగించే సెక్షన్లుగా పరిగణించాలన్నారు. రాష్ట్రంలో 535
సివిల్ కోర్టులు ఉన్నా న్యూ అధికారులతో ఏర్పాటు చేసిన 26 రెవిన్యూ
ట్రిబ్యునల్స్ వివాదాలను పరిష్కరించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. విజయవాడ
బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు చలసాని అజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయవ్యవస్థల పరిధిలను తప్పించే అధికారం లేదన్నారు.
న్యాయం, ధర్మం కాపాడేందుకు జరిగే పారాటానికి బార్ అసోసియేషన్ కలిసి
వస్తుందన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ భూహక్కుల
చట్టం రద్దు చేయాల్సిందేనన్నారు. అంబానీ, ఆదానీలకు నీతి ఆయోగ్ ద్వారా లాభాలు
చేకూర్చేందుకు జగన్ ఇలాంటి చట్టాలు అమలు చేస్తున్నారన్నారు. ఏఐ కెఎఫ్ రాష్ట్ర
అధ్యక్షులు ఎం వెంకట్రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు యు.
వీరబాబు, జాగృతి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మరీదు ప్రసాదు, తెలుగు రైతు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుర్ర నరేంద్ర, రైతు సంఘం ఉపాధ్యక్షులు మర్రాపు
సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మల్నీడు
ఎల్లమందరావు, జిల్లా కార్యదర్శి చుండూరు సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం
గుంటూరు జిల్లా కార్యదర్శి పచ్చల శివాజీ, గుంటూరుజిల్లా వ్యవసాయ కార్మికసంఘ
కార్యదర్శి ఈశ్వరరావు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి
జమలయ్య తదితరులు పాల్గొన్నారు.