ప్రభుత్వం విధ్వంసంతో ప్రారంభమై అవినీతిలో కూరుకుపోయింది
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
రాజమహేంద్రవరం : కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాలకు రాష్ట్ర
ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంటోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి
పురందేశ్వరి ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరించిందని,
అప్పుడు చంద్రన్న స్టిక్కర్లు వేసుకున్నారని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా
జగనన్న స్టిక్కర్లు వేసుకుంటోందని విమర్శించారు. అందుకే కేంద్ర ప్రభుత్వ
పథకాలకు ప్రధాని పేరు, ఫొటో పెట్టకపోతే నిధులు నిలిపివేస్తామని కేంద్రం
ప్రకటించిందని పురందేశ్వరి వెల్లడించారు. ఆయా పథకాలను కేంద్రం అమలు
చేస్తోందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని, అయితే ప్రజల్లో దీనిపై అవగాహన
పెరిగిందని తెలిపారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి మాట్లాడుతూ కేంద్రం
నిధులు ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు చంద్రన్న నేడు జగనన్న పేర్లు తో
స్టిక్కర్ లు వేసుకున్నారు. కేంద్రప్రభుత్వం సీరియస్ గా
చెప్పదలుచుకున్నది.కేంద్ర పధకాలకు పేర్లు మారిస్తే కుదరదని తేల్చి చెప్పడం
జరిగింది. కేంద్రం తనవంతు సాయంగా ప్రతి జిల్లాకు సహాయం అందించింది.
రాజమండ్రిలో మెడికల్ కాలేజీ, ఈఎస్ఐ హాస్పిటల్, మోరంపూడి ఫ్లైఓవర్
నిర్మిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రం జలజీవన్ మిషన్ కింద 6000 కుళాయి
కనెక్షన్లు ఇచ్చింది. టూరిజం పెంపొందించేందుకు రాజమండ్రి నుంచి లంబసింగి హైవే
వేస్తున్నాం. కేంద్రం ఇచ్చిన డబ్బులను జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి
పంచుతున్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉంది. ఇళ్ల స్థలాల పేరుతో మడ
అడవులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తా : ఈ ప్రభుత్వం విధ్వంసంతో
ప్రారంభమై అవినీతిలో కూరుకుపోయింది. ఈ రకమైన ప్రభుత్వం మనకు అవసరమా అనే
విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. మాకు సేవ చేసే భాగ్యం ప్రజలు
కల్పించాలని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి ఆయా జిల్లాలో ఉన్న
రాజకీయ పరిస్థితులు సమీకరణాలను తెలుసుకుంటానన్నారు. ప్రైవేటు ఆసుపత్రులన్నీ
ఆరోగ్యశ్రీని అనుమతించడం లేదని, కేంద్రం పెట్టిన ఆయుష్మాన్ భవ అన్ని
ఆసుపత్రుల్లో అమలవుతుందన్నారు. ఆయుష్మాన్ భవ కార్డు ద్వారా ప్రతి పేదవాడికి
ఐదు లక్షలు ఖర్చు పెడుతుందని, దేశంలో ఎక్కడైనా వైద్యం అందుతుందని, వికసిత్
భారత్ ద్వారా కేంద్ర పధకాలకు ప్రచారం తో పాటు లబ్ది దారులు ను ఎంపిక కూడా అదే
సమయంలో చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలు బిజెపి ని ఆశీర్వదించాలని
విజ్ఞప్తి చేశారు.
ఇఎస్ఐ ఆసుపత్రి పనుల పరిశీలన : ఇఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం బిజెపి ప్రతినిధులు
పరిశీలించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఇఎన్ఎస్
ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్న పనులు పరిశీలించి నిర్మాణం ఎప్పుడు పూర్తి
అవుతుందన్న విషయాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇఎస్ఐ ఆసుపత్రి 100పడకల
ఆసుపత్రిని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో నిర్మిస్తున్నామని, 80 శాతం పనులు
పూర్తి చేశామని అధికారులు వివరించారు. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము
వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథ్ రాజు, బిజెపి జిల్లా
అధ్యక్షుడు బొమ్మల దత్తు, రేలంగి శ్రీ దేవీ తదితరులు పాల్గొన్నారు.