విజయవాడ : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో
అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసిన టిటిడి మాజీ చైర్మన్ వై వి
సుబ్బారెడ్డి దంపతులు విచ్చేయగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు,
కార్యనిర్వాహణాధికారి కే ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి
దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ
చైర్మన్, కార్య నిర్వాహణాధికారి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం
అందించారు. అనంతరం కండవల్లి, పెరవలి (మ), తూర్పు గోదావరికి చెందిన భూపతి రాజు
వరాహ వెంకట సూర్య నారాయణ రాజు, హైమావతి సూర్యకుమారి దంపతుల వారు వై వి
సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఆలయంలోని క్షేత్ర పాలక అభయాంజనేయ స్వామి వారికి
బంగారు కవచం, మకర తోరణం, అపరాజిత దేవి అమ్మవారికి వెండి కవచం ఇతర పూజా
సామాగ్రిని అందించారు. తిరుపతికి చెందిన నగరం అమర్ వై.వి సుబ్బారెడ్డి చేతుల
మీదుగా వృద్ధులు, దివ్యాంగులు, చంటి బిడ్డల సౌకర్యార్థం టాటా కంపెనీకి చెందిన
2 వ్యాన్లు దేవస్థానంనకు బహుకరించారు. అనంతరం వీరు వాహనాలకు పూజలు
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు కట్టా సత్తయ్య,
ప్రత్యేక ఆహ్వానితులు జక్కి రెడ్డి ప్రభాకర్ రెడ్డి, సివిల్ సప్లైస్ డైరెక్టర్
టి. చంద్రశేకర్ రెడ్డి, నారాయణ రాజు ఆలయ అధికారులు, వైదిక సిబ్బంది, తదితరులు
పాల్గొన్నారు.