విజయవాడ : కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని సీపీఐ
రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన లేఖ
రాశారు. ప్లాంట్ నిర్మాణానికి 2019, 2023లో రెండుసార్లు భూమిపూజ చేశారని,
ప్లాంట్ నిర్మించి 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని లేఖలో
గుర్తు చేశారు. చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని కోరారు.
జగన్ 11 లక్షల కోట్లను అప్పు తెచ్చి ఏం చేశాడో చెప్పాలి : జగన్ ప్రభుత్వం
దిగిపోయే నాటికి రాష్ట్రం అప్పు 10 లక్షల కోట్లుకు చేరుతుందని ముందునుంచే
చెబుతున్నామని, అయితే ఆయన దాన్ని మించి 11 లక్షల కోట్లను ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి అప్పుగా తీసుకున్నాడని వాటిని ఏం చేశాడో చెప్పాలని సీపీఐ రాష్ట్ర
కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అరాచకం రాజ్యం
ఏలుతుందా’’ అనే అంశంపై ఆదివారం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ
సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా రాష్ట్రాన్ని
అప్పలు పాలు చేశారని, రుణగ్రస్తం చేశారని కొందరు అంటున్నారని చెప్పారు. తాము
మాత్రం అసలు అప్పు చేసిన సొమ్ముని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏం చేశారో
చెప్పాలని నిలదీశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి టీడీపీ కన్నా తాము
తక్కువగా అప్పు చేశామని, తాము అప్పు చేసిన పైసలను సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు
చేశామని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. అప్పు
చేసిన సొమ్ము నుంచి జనాలకు రెండు లక్షల 60వేల కోట్లు పంచామని చెప్పారన్నారు.
అలా అయతే ప్రకాశం జిల్లాల్లో గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడో నెంబర్ గేటు
కొట్టుకుపోతే 8 కోట్లను రిపేర్లకు ఎందుకు నేటికి ఇవ్వలేదని ప్రశ్నించారు.
తాజాగా మొన్న ఇంకో గేటు కూడా కొట్టుకుపోయిందని రామకృష్ణ చెప్పారు.
[image: image.png]