ఎన్టీఆర్ జిల్లాలో రెండు అసెంబ్లీ టికెట్లు బీసీలకు ఇవ్వాలి * యుద్ధ
ప్రాతిపదికన కుల గణన ప్రక్రియ ప్రారంభించాలి * ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘం
అధ్యక్షుడు డాక్టర్ ఎన్.మారేష్ * ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీల
ఐక్యత ర్యాలీ
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో మైలవరం పట్టణంలో బీసీల ఐక్యత
ర్యాలీ నిర్వహించారు. బీసీల ఐక్యత ర్యాలీకి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
బీసీ సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎన్.మారేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ సీటు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ
విజయవాడ పార్లమెంటరీ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీ.సీల ఆత్మీయ
సమావేశాలు, ఐక్యత ర్యాలీలు నిర్వహిస్తున్నామని దానిలో భాగంగా మైలవరం పట్టణంలో
బీసీల ఐక్యత ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మైలవరం నియోజక
వర్గంలోని అన్ని మండలాల నుండి దాదాపు 30కి పైగా కుల సంఘాల నాయకులు యువత పెద్ద
ఎత్తున హాజరవ్వటం హర్షించదగ్గ విషయమన్నారు. 1952 నుంచి 2019 వరకు 17 సార్లు
పార్లమెంటుకు ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా బీసీ వ్యక్తికి అవకాశం రాకపోవడం
దురదృష్టకరమన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో 16 లక్షల ఓటర్లు ఉంటే వారిలో
ఎనిమిది లక్షల పైగా బీసీలు ఉన్నారని, బీసీ అభ్యర్థికి ఎంపీ పదవి ఇవ్వాలని
డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉంటే రెండు
ఎస్సీ రిజర్వుడు స్థానాలు నిర్వహిస్తే మిగతా ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క
బీసీ కూడా ఎమ్మెల్యేగా లేకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లాని ఒక యూనిట్ గా
చేసుకొని రెండు అసెంబ్లీ టికెట్లు బీసీలకు ఇవ్వాలని డిమాండ్
చేస్తున్నామన్నారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో బీసీలు ఆత్మ గౌరవాన్ని
గౌరవించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సర్పంచ్ స్థాయి నుంచి రాజ్యసభ
స్థానాల వరకు , మంత్రివర్గంలోనూ నామినేటెడ్ పదవుల్లోనూ ఎమ్మెల్సీలుగా, బీసీలకు
రాజ్యాధికారంలో 65శాతం పైగా వాటా ఇచ్చిన ఘనత వైయస్ జగన్ కు దక్కుతుందన్నారు.
విజయవాడ పార్లమెంటు చరిత్రను పరిశీలించి బీసీలకు అవకాశం కల్పించాలని వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కోరారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
, కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరపున విజ్ఞప్తి
చేశారు. యుద్ధ ప్రాతిపదికన కుల గణన ప్రక్రియను ప్రారంభించి బీసీ జనాభా
లెక్కలు బయటకు తీయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు
వేముల బేబీ రాణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈతాకులు జగదీష్, రాష్ట్ర మహిళా
ఉపాధ్యక్షురాలు రాజులపాటి కళ్యాణి, రాష్ట్ర కార్యదర్శి రామాంజనేయులు, యువజన
విభాగం అధ్యక్షులు డేరంగుల నాని, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వేములకొండ
సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోమటి కోటేశ్వరరావు, మట్ట రవికుమార్,
కందుల శివకృష్ణ, ఉయ్యూరు వెంకటేశ్వరరావు, కందుల రామకృష్ణ తదితర కుల సంఘాల
నాయకులు పాల్గొన్నారు.