హైదరాబాద్ : సమాజంలో అంతరించిపోతున్న తెలుగు బాషను కాపాడుకోవాల్సిన అవసరం
ప్రతి ఒక్కరిపై ఉందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. తెలుగువారు
ఎక్కడ వున్నా తెలుగు ఖ్యాతిని ఇనుమడింపచేయాలని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం
సిద్దించి 2047 నాటికి వందేళ్లు పూర్తి కాబోతున్నాయని, ఆ సమయానికి దేశాన్ని
అగ్రగామిగా తీర్చిదిద్దడానికి ప్రధాని నరేంద్ర మోడీ పక్క ప్రణాళికతో
సాగుతున్నారని బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ
అమెరికా తెలుగు సంఘం (టి టి ఏ) గ్రాండ్ ఫినాలే కల్చరల్ ఈవెంట్ ను ఇండియా
కో-ఆర్డినేటర్ డాక్టర్ ద్వారకానాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్సవాల
సలహామండలి వ్యవస్థాపకులు డాక్టర్ మల్లారెడ్డి, ఉత్సవాల కమిటీ అధ్యక్షులు వంశీ
రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎం. నవీన్ రెడ్డి , ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు
డాక్టర్ నరసింహా రెడ్డి, ప్రధాన కార్యదర్శి కవితా రెడ్డి, కోశాధికారి
;పెద్దిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు సినీ నేపధ్య గాయనీ
గాయకుల సంగీత విభావరి, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం
వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారిని ఘనంగా సత్కరించారు.