దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరధ్ రెడ్డి కి నివాళులు అర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం అవుకు రానున్నారు. గత కొంతకాలంగాన్యూమోనియా వ్యాధి తో అనారోగ్యానికి గురైన ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి హైదరాబాద్ గచ్చిబౌలి ఏజీఐ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం ఈనెల 25న చేరారు,
గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న భగీరథ రెడ్డికి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజాము నుండి వెంటిలేటర్ పై వైద్య చికిత్స అందించారు.
భగీరథ రెడ్డి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడినట్లు,వైద్యానికి సహకరించినట్టు సమాచారం తెలియడంతో మంగళవారం జిల్లా అభిమానులు వైసిపి నాయకులు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బుధవారం తెల్లవారు జామున ఊహించని రీతిలో చల్లా భగీరథ రెడ్డి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పాటు పల్స్ రేటు పడిపోయింది.
ప్రత్యేక వైద్య బృందం చెల్లా భగీరథ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరిచేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఎమ్మెల్సీ చల్లా భగీరధ్ రెడ్డి. తుది శ్వాస విడిచారు.
ఎమ్మెల్సీ చల్లా భగీరధ్ రెడ్డి పార్థివ దేహాన్ని హైదరాబాదు నుండి గురువారం తెల్లవారుజామున అవుకు తీసుకురానున్నారు.
గురువారం సాయంత్రం అవుకులని చల్లా ఫామ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
గురువారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అవుకు చేరుకొని దివంగత చల్లా. భగీరథ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు.
ఈ మేరకు సీఎం పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ గ్రౌండ్, ఇనుప బారికేడ్ల నిర్మాణ పనులను, అధికారులు శరవేగంగా చేపట్టారు. .
అవుకు లో ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి నివాసం వద్ద భారీ ఏర్పాట్లు,చేపట్టారు వందలాది మంది అభిమానులు అవుకు తరలివస్తున్నారు
సీఎం జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించి వెళ్లిన అనంతరం అవుకు పట్టణ వీధుల్లో ఎమ్మెల్సీ చల్లా భగీరధ్ రెడ్డి పార్థివ దేహాన్ని భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించనున్నారు.