వైఎస్ఆర్ జిల్లా, ఇడుపులపాయ : మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు
విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రెండవ రోజు
ఆదివారం ఉదయం 9.10 గంటలకు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుని దివంగత
ముఖ్యమంత్రి డా.వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రితో పాటు
వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జిల్లా ఇంఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్,
ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, ఎంఎల్సీ రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్
వి.విజయ్ రామరాజు, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల
శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, ఏపీ
స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రా రెడ్డి, పరిశ్రమల
శాఖ ముఖ్య సలహాదారు రాజోలి వీరారెడ్డి, తదితరులు దివంగత ముఖ్యమంత్రి
డా.వైఎస్ఆర్ కు నివాళులు అర్పించారు. అనంతరం ఇడుపులపాయ లోని డాక్టర్ వైయస్ఆర్
విగ్రహానికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు
అర్పించారు. అనంతరం ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన పులివెందుల మండల
ప్రజాప్రతినిధుల సమావేశానికి బయలుదేరి వెళ్లారు.