మృతులు గుత్తి మండలం మాముడూరు కు చెందిన వారు
ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి
అనంతపురం : అనంతపురం జిల్లా కల్లూరు సమీపంలో జాతీయ రహదారిపై శనివారం
తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గార్లదిన్నె నుంచి గుత్తి
మండలం మాముడూరుకు బియ్యం బస్తాలతో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక వైపు నుంచి
వోల్వో బస్సు వెనుకవైపు నుంచి వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ
ప్రమాదంలో మాముడూరుకు చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందిన హృదయ విదారకమైన
సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
గుత్తి మండలం మాముడూరు గ్రామానికి చెందిన కుమ్మర శ్రీరాములు, కుమ్మర
శ్రీనివాసులు, కుమ్మర నాగార్జున, కుమ్మర చిన్న తిమ్మప్ప లు గార్లదిన్నె లోని ఓ
ప్రైవేట్ రైస్ మిల్లులో బియ్యాన్ని ఆడించుకొని తిరిగి తమ గ్రామానికి శనివారం
తెల్లవారుజామున బయలుదేరారు. ట్రాక్టర్ లో బియ్యం బస్తాలతో పాటు వారు పైన
కూర్చుని ఉండగా వెనుక వైపు నుంచి వచ్చిన వోల్వో బస్సు తెల్లవారుజామున సమయం
కావడంతో ట్రాక్టర్లు గమనించకుండా వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం
చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అత్యంత వేగంతో
వోల్వో బస్సు ట్రాక్టర్ తో బియ్యం బస్తాలు రోడ్డు దాటి అవతల వైపుకి పడ్డాయి.
అతివేగంతో వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగాన్ని అదుపు చేయలేక
బస్సు ట్రాక్టర్ వెనుక వైపున ఇరుక్కునిపోవడంతో స్థానికులు జెసిబి సహాయంతో
బస్సును లాగి బయటకు తీశారు. మృతదేహాలు చిందర వందరగా అత్యంత హృదయ విదారకంగా పడి
ఉండటాన్ని గమనించిన స్థానికులు వాటిని రోడ్డు పక్కకు చేర్చి పోలీసులు
వచ్చేంతవరకు వారు కాపలాగా ఉన్నారు. అనంతరం అంబులెన్స్ సహాయంతో పామిడి ప్రభుత్వ
ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించారు. పోలీసులు కేసు నమోదు
చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం : తనవంతుగా ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు
ప్రకారం 2 లక్షల రూపాయలు మృతుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించిన గుంతకల్
ఎమ్మెల్యే వై వెంకట రామిరెడ్డి. ప్రభుత్వం నుండి ఒక్కొక్కరికి రెండు లక్షల
రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గుత్తి మండలం మాముడూరు గ్రామానికి
చెందిన కుమ్మర శ్రీరాములు, కుమ్మర శ్రీనివాసులు, కుమ్మర నాగార్జున , కుమ్మర
చిన్న తిమ్మప్ప, శనివారం తెల్లవారుజామున పామిడి బ్రిడ్జి సమీపంలో ట్రాక్టర్
ఓల్వో బస్ ప్రమాదం లో మృతి చెందిన విషయం తెలుసుకున్న గుంతకల్ నియోజకవర్గం
ఎమ్మెల్యే వెంకట రామిరెడ్డి స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న వెంటనే
పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను చూసి వారి కుటుంబ సభ్యులను
ఓదారుస్తూ అధైర్య పడకండి.. మీకు అండగా నేనుంటా అని భరోసా కల్పిస్తూ వారిని
ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన వంతు ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు
అందించడంతోపాటు ప్రభుత్వం నుండి 2 లక్షలు ఎక్స్ గ్రేషియా తో పాటు ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి తో మాట్లాడి మరింత సహాయం అందేలా కృషి చేస్తానని అన్నారు. ఈ
కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, తుగ్గిలి నాగేంద్ర, మాజీ
మార్కెట్ యార్డ్ చైర్మన్ చెన్నకేశవరెడ్డి , గుత్తి మండల కన్వీనర్ గోవర్ధన్
రెడ్డి, జడ్పిటిసి ప్రవీణ్ కుమార్ యాదవ్, పామిడి పట్టణ కన్వీనర్ జోజోడు
కుమార్, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీ నాయకులు,
కార్యకర్తలు హాజరయ్యారు.