హైదరాబాద్ : తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ
సువర్ణ అధ్యాయమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రాత్రి, పగలూ తేడా లేకుండా
చెమటోడ్చి తెలంగాణను నిర్మించామని, రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తే
సహించేది లేదన్నారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపే ప్రయత్నం చేస్తూ,
అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోబోమని కేటీఆర్
హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే తొమ్మిదిన్నరేళ్ల భారాస పాలనపై ‘స్వేదపత్రం’
పేరిట శనివారం తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు
కేటీఆర్ తెలిపారు. గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని
వివరించనున్నట్లు చెప్పారు. అప్పులు కాదు.. రాష్ట్రం సృష్టించిన సంపదను
ఆవిష్కరిస్తామన్నారు.