చంద్రబాబు హామీలిస్తే రాష్ట్రం శ్రీలంక కాదా?
విజయవాడ : జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిజమైన ప్రజా ప్రభుత్వం అని వైఎస్సార్
పెన్షన్ కానుకను రూ.3000 లకు పెంచుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ
ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా
వేదికగా శుక్రవారం పలు అంశాలపై తనదైన శైలిలో స్పందించారు. వృద్ధులు,
వితంతువులు, వస్త్రకారులు, కల్లుగీత కార్మికులు, చర్మకారులు, మత్స్యకారులు,
ఇతర లబ్దిదారులు, రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల మంది లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం
నింపారని అన్నారు.
జాతీయ ప్రాముఖ్యత పొందిన భోగాపురం ఎయిర్ పోర్ట్ : భోగాపురం గ్రీన్ ఫీల్డ్
ఎయిర్ పోర్ట్ లో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రూ.675 కోట్లు
పెట్టుబడితో ప్రాజెక్టు జాతీయ ప్రాముఖ్యతను సంతతరించుకుందని విజయసాయి రెడ్డి
అన్నారు. గతంలో అద్భుతమైన రీతిలో హైదరాబాద్ విమానాశ్రయం నిర్మాణం చేపట్టి
విశ్వవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న జీఎంఆర్ సంస్థ అదే పంధాను భోగాపురం ఎయిర్
పోర్ట్ నిర్మాణంలోనూ కొనసాగిస్తుందని గట్టిగా నమ్ముతున్నానని అన్నారు.
చంద్రబాబు హామీలిస్తే రాష్ట్రం శ్రీలంక కాదా? : జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం మరో శ్రీలంకగా మారిపోతుందని గగ్గోలు
పెట్టిన పచ్చ మీడియాకు ఏదోలా అధికారం చేజిక్కించుకోవాలన్న దురభిప్రాయంతో
ఇప్పుడు ఇస్తున్న దానికన్నా మూడింతలు ఇస్తామన్న చంద్రబాబు హామీలతో రాష్ట్రం
శ్రీలంకగా మారదా? అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నకు పచ్చ ముఠా
సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత చంద్రబాబుది దగా ప్రభుత్వం అని రుణమాఫీ
చేస్తామని, రైతులకు, డ్వాక్రా మహిళలకు దగా చేశారని, చివరకు మేనిఫెస్టో సైతం
మాయం చేశారని ఈ మేరకు ప్రజలు దీన్ని గమనించాలని ముఖ్యమంత్రి కోరారని విజయసాయి
రెడ్డి అన్నారు.