విజయవాడ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై విజయవాడ ఏసీబీ
కోర్టులో సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో
లోకేశ్‌కు ఎన్బీడబ్ల్యూ జారీచేయాలని, ఈ కేసులో ఆయనపై చర్యలు తీసుకోవాలని
కోరింది. ఐఆర్ఆర్ కేసులో 41ఏ నోటీస్ నిబంధనలను లోకేశ్ ఉల్లంఘించారని
ఆరోపించింది. సాక్ష్యాలు ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించగా పత్రికల
క్లిప్పింగ్‌లను సీబీఐ తరపు న్యాయవాది చూపించారు. లోకేశ్‌ను అరెస్టు చేసేందుకు
అనుమతి ఇవ్వాలని, రెడ్ బుక్ పేరుతో అధికారులను లోకేశ్ బెదిరిస్తున్నారని
పిటిషన్లో పేర్కొంది. 41ఏ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం
కోర్టుకు ఉండదని పిటిషన్లో సీఐడీ పేర్కొంది.