హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తంగా
ఆరు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 26 గంటల 33 నిమిషాల పాటు చర్చ జరిగింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. 19
మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. శాసనసభ సమావేశాలు వాయిదా పడిన అనంతరం
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. తెలంగాణ
ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు
చేయాలనే చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు. ‘‘భారాస ఏ విధంగా రాష్ట్ర ఆర్థిక,
విద్యుత్ వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి, ప్రజలను పదేళ్లపాటు ఎలా
మభ్యపెట్టిందో శ్వేతపత్రాల ద్వారా వివరించాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో
పెట్టేందుకు సభ్యుల సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఒక ప్రయత్నం చేశాం. అప్పులు
చేశాం.. చేసిన అప్పుల వల్ల అనుకున్న ఫలితాలు సాధించలేకపోయామని స్వయంగా భారాస
నేతలే చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా ప్రజాధనం ఖర్చు చేశారు.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలు ఒక్కొక్కరిపై రూ.7 లక్షల అప్పును గత ప్రభుత్వం
మోపింది’’ అని శ్రీధర్‌బాబు వివరించారు.