విజయవాడ : బుధవారం విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ ని జ్వాలాపురం శ్రీకాంత్
మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రాచీన ఆలయ సంస్కృతి పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం చేస్తున్న కృషికి తమవంతు సహకారాన్ని అందించాలని రాష్ట్ర గవర్నర్
ఎస్. అబ్దుల్ నజీర్ ని దేవదాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్
కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పురాతన ఆలయాల పునర్నిర్మాణం కోసం
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను శ్రీకాంత్ గవర్నర్ కి వివరించారు.
చారిత్రక ఆలయాలను సంరక్షించడం ద్వారా భావితరాలకు హైందవ ధర్మ సంస్కృతిని
అందించే అవకాశం ఉంటుందని, ఈ విషయంలో కేంద్రం నుంచి అందవలసిన నిధుల సహాయంతో
పాటూ, పురావస్తు శాఖ అనుమతుల ద్వారా పురాతన ఆలయాలను మరమ్మత్తులు చేసేందుకు
గవర్నర్ తమవంతు సహకారం అందించాలని జ్వాలాపురం శ్రీకాంత్ విన్నవించారు.
ముఖ్యంగా ద్రాక్షారామం, గుడిమల్లం వంటి రాష్ట్రంలోని పలు ఆలయాల పునరుద్ధరణ
విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్ధనపై పురావస్తు శాఖ అనుమతులు
లభించాల్సి ఉందని, ఈ విషయంలో గవర్నర్ వారి ప్రమేయం ఉంటే త్వరగా ఫలితం ఉంటుందని
శ్రీకాంత్ కోరారు.