విజయవాడ : నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహణలో స్కిల్ డెవలప్మెంట్ అండ్
టెక్నికల్ ఎడ్యుకేషన్ సిబందికి విజయవాడ ఫార్చ్యూన్ మురళి పార్క్ లో
వర్కుషాప్ నిర్వహించారు. ఈ వర్కుషాప్ లో సంవత్సరిక ప్రణాళికలను సమీక్షిస్తూ
రానున్న త్రైమాసిక నెలల కార్యాచరణ ప్రణాళికను చర్చించేందకు ఎస్ డీ టీ విభాగం
లోని జిల్లా స్థాయి అధికారులతో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్కుషాప్ లో
రాబోయే మూడు నెలల లో పూర్తి చేయాలవల్సిన కార్యక్రమాలు, వచ్చే ఆర్ధిక
సంవత్సరంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నిర్వహించాల్సిన నిర్దిష్ట
ప్రణాళికలను చర్చించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి
యస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు
కల్పించాలంటే ముఖ్యంగా వివిధ సెక్టార్స్ లోని ఉద్యోగ అవకాశాలకు అనుసంధానంగా
నైపుణ్యాలను వాళ్ళకి కావాల్సిన శిక్షణాలను జిల్లా స్థాయి అధికారుల యొక్క
అభిప్రాయాలను , సలహాలు సూచనలు తెలియచేయాలని కోరారు. యువతకు సంబంధిచిన ఉపాధి
అవకాశాల వెసులుబాటు కొరకు ఎటువంటి శిక్షణాలను ఇవ్వాలనే అంశాలపైనా
నైపుణ్యాభివృద్ధి సంస్థ లోని ఉన్నత ఉద్యోగులతో కలిసి డిస్ట్రిక్ట్
ఎంప్లాయిమెంట్ ఆఫీసర్స్ కూడా కలిసి కూలంకశంగా చర్చించుటయే ఈ వర్కషాప్ యొక్క
ముఖ్య ఉదేశం అని తెలిపారు. 2019 నుండి నైపుణ్యాభివృద్ధి సంస్థ లో ఉన్న అన్ని
అంశాలను ఒకే దగ్గరకి తీసుకొచ్చి ఒక స్కిల్ ఎకో – సిస్టం ను చేసి తద్వారా
రాష్ట్రము లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతి యువకులకు నైపుణ్యం కల్పించి మన
రాష్ట్రము లోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశవిదేశాల్లో కూడా ఉపాధి
అవకాశాలను కల్పించాలనే ఉద్దేశ్యంతో స్కిల్కా స్కేడింగ్ పారడైమ్తోపాటుగా
నైపుణ్య కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కోరారన్నారు. అన్ని
సెక్టార్స్ లో ఉపాధి అవకాశాలు ఉన్నాయని, వారికి కావాల్సిన నైపుణ్య శిక్షణా,
విద్యార్థులకు స్కిల్ హిబ్స్ , స్కిల్ కాలేజెస్ ద్వారా నైపుణ్యాభివృద్ధి
సంస్థ అందిస్తుందని, దీనిని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి మాట్లాడుతూ
నైపుణ్యాభివృద్ధి సంస్థ ముఖ్య ఉదేశ్యం ఆంధ్ర రాష్ట్ర యువతకు తగిన శిక్షణ
నైపుణ్యాలను అందించి అభివృద్ధి చేయడం, ముఖ్య మంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి
గారి ఆశయం విద్య – నైపుణ్యం – ఉద్యోగ ఉపాధి అని , దానిని సాధించటమే
నైపుణ్యాభివృద్ధి సంస్థ లక్ష్యం అని వివరించారు .ఇందులో భాగంగా ఇప్పటికే
స్కిల్ కాస్కేడింగ్ సిస్టం ద్వారా స్కిల్ హిబ్స్ , కాలేజెస్ ద్వారా శిక్షణ
ఇవ్వటం జరుగుతోందని, రానున్న రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ కూడా
తీసుకువస్తామని చెప్పారు.
నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈఓ డాక్టర్ వీ వినోద్ కుమార్ మాట్లాడుతూ
నైపుణ్యాభివృద్ధి సంస్థ వార్షిక ప్రణాళికలను సమీక్షించారు . యువత అభివృద్ధి,
నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఉపాధి అవకాశాలను విస్తృతంగా అందించే దిశగా
జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులకి సలహాలు, సూచనలను అందించారు. నాన్
అకాడమిక్ ట్రైనింగ్స్ కాకుండా అకాడమిక్ విభాగాలలో నైపుణ్యాభివృద్ధి సంస్థ
అందించే శిక్షణాల గురించి కూడా కులంకుశంగా చర్చించి తగు సూచనలు సలహాలు
ఇచ్చారు. రాబోవు ఆర్ధిక సంవత్సరానికి నైపుణ్యాభివృద్ధి సంస్థలో వారి వారి
జిల్లాలలో ఎలాంటి శిక్షణ జరగాలనే వాటి పై దిశానిర్దేశం చేసారు. డైరెక్టర్
ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ నవ్య , మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు
కల్పించే దిశగా అన్ని విధాలుగా సహాయపడతామన్నారు. ఈ కార్యక్రమంలో
నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి యస్. సురేష్ కుమార్ ,
నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి , ఎండీ, సీఈఓ వినోద్
కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ నవ్య , , ఎగ్జిక్యూటివ్
డైరెక్టర్ కే . దినేష్ కుమార్ , సి ఇ ఓ సీడప్ శ్రీనివాసులు, జిల్లా స్థాయి
అధికారులు, నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది పాల్గొన్నారు