మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రవాస భారతీయుల సమావేశంలో జనసేన
అధ్యక్షులు పవన్ కళ్యాణ్
పార్టీకి రూ.1.30 కోట్లు విరాళం అందించిన ప్రవాస భారతీయులు
గుంటూరు : జనసేన పార్టీ ఎదుగుదల కోసం ప్రవాస భారతీయులు, ముఖ్యంగా
ప్రవాసాంధ్రులు అందిస్తున్న సహకారం ఎన్నటికీ మరువలేనిదని పార్టీ అధ్యక్షులు
పవన్ కళ్యాణ్అ న్నారు. ఆశయాలను కాపాడుకుంటూ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే ఈ
ప్రయాణంలో ఎన్.ఆర్.ఐ.లు తమ వంతు సహకారం అందిస్తూ ముందడుగు వేయడం జనసేన
ప్రస్థానంలో గుర్తుండిపోతుందన్నారు. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ
ఆస్ట్రేలియ కన్వీనర్ శ్రీ కొలికొండ శశిధర్ ఆధ్వర్యంలో యూకే, ఐర్లాండ్,
ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్ కు చెందిన జనసేన ఎన్.ఆర్.ఐ. బృందాలు పవన్
కళ్యాణ్ ని కలిశాయి. పార్టీ సహాయ నిధికి రూ.1.30 కోట్లు విరాళంగా అందించాయి.
రాష్ట్ర భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న జనసేన పార్టీకి ఎల్లవేళలా
అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎన్.ఆర్.ఐ.లు తెలిపారు. అనంతరం పవన్ కళ్యాణ్
మాట్లాడుతూ ప్రవాస భారతీయుల సేవలను జనసేన పార్టీ ఎప్పటికీ మరవదు. పార్టీ
ముందుకు వెళ్లడంలో ఎన్.ఆర్.ఐ.లు అందిస్తున్న మద్దతు, చేస్తున్న కృషి అమోఘం. మీ
ప్రేమాభిమానాలు, మద్దతు పార్టీపై ఎప్పటికీ ఇలానే ఉండాలన్నారు.