అమరావతి : మన రాష్ట్రంలో కోవిడ్ కేసులు తాజాగా ఇప్పటి వరకూ ఒక్కటి కూడా నమోదు
కాలేదని, అయితే కేరళ వంటి రాష్ట్రాలలో కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో మనం
అత్యంత జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుందని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకూ
మన రాష్ట్రంలో ఎటువంటి కేసులూ నమోదు కాలేదని, అందువల్ల భయపడాల్సిన అవసరం
లేదని, కానీ జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుందని అన్నారు. వ్యాధి వ్యాప్తి
నిరోధానికి అవసరమైన సామాజిక దూరం పాటించటం, మాస్కుల వినియోగాన్ని పెంచటం వంటి
చర్యలు తీసుకోవాల్సిందిగా తాము ప్రజలకు సూచిస్తున్నామన్నారు. శస్త్ర
చికిత్సలు చేయించుకున్న వారు, వారికి సహాయకులుగా వచ్చిన వారిని తమ సిబ్బంది
నిశితంగా గమనిస్తున్నారని, వారికి వ్యాధి లక్షణాలు కన్పిస్తే అవసరమైన వైద్య
చికిత్స అందించేందుకు సిద్ధంగా వున్నారన్నారు. ఎవరైనా వ్యక్తులు కూడా తమలో
వ్యాధి లక్షణాలు గుర్తిస్తే స్వీయ ఏకాంతాన్ని ను అనుసరిస్తే అందరికీ మేలు
చేసిన వారవుతారని ఆయన సూచించారు. గ్రామ సచివాలయ స్థాయిలో వున్న విలేజ్
క్లినిక్ లు అన్నింటికీ యాంటిజెన్ టెస్ట్ కిట్లు ఇప్పటికే అందచేశామని ఆయన
చెప్పారు. అక్కడ ఏదైనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే దానిని ఆర్టీపీసీఆర్
టెస్ట్ కు పంపటానికి వీలుగా రాష్ట్రంలోని 11 వైద్య కళాశాలల్లో టెస్ట్ లకు
అవసరమైన సౌకర్యాలను సిద్ధంగా వుంచామని చెప్పారు. అక్కడ కూడా పాజిటివ్
నిర్ధారణ అయితే విజయవాడలో జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపి వేరియంట్ ను గుర్తించి
దాని వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే కేరళ,
తమిళనాడు తరహాలో మన రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఇటువంటి సమస్య తలెత్తలేదని, అయితే
మనం ముందు జాగ్రత్త పాటించటం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. బయటకు వెళ్లే
సమయంలో మాస్క్ లు ధరించటం, సామాజిక దూరం పాటించటం, పరిశుభ్రతను పాటించటం వంటి
చర్యల ద్వారా వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చని ఆయన సూచించారు.