గుంటూరు : జర్నలిస్ట్ నాయకులుగా ఎదిగి ప్రభుత్వంలో పదవులు పొందడం సర్వ
సాధారణంగా మారింది. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్
గా ఉన్న సీనియర్ జర్నలిస్ట్, సాక్షి టీవీ ఎడిటర్ నేమాని భాస్కర్ ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ ప్రజా విధానాలు (పబ్లిక్ పాలసీ) సలహాదారులుగా నియమితులయ్యారు. నేమాని
భాస్కర్ గా అందరికి సుపరిచితులైన ఎన్. వి. వి. ఎస్. భాస్కర రామం
వివాదరహితుడుగా మంచి జర్నలిస్ట్ గా పేరు గడించారు. విశాఖపట్నం గాజువాక
ఆంధ్రభూమి కంట్రిబ్యూటర్ గా భాస్కర్ పాత్రికేయ ప్రస్థానం ప్రారంభమైంది. అదే
పత్రికలో హైదరాబాద్ పొలిటికల్ స్టాఫ్ రిపోర్టర్ గా ప్రత్యేక గుర్తింపు
పొందారు. ఎన్ టీవీ సెక్రటేరియట్ బీట్ సీనియర్ రిపోర్టర్ గా, అనంతరం ఇన్ పుట్
ఎడిటర్ గా మారారు. అక్కడ నుంచి కొన్నాళ్ళు ఎక్స్ ప్రెస్ టీవీ లో పని చేశారు.
తరువాత సాక్షి టీవీ ఎడిటర్ గా సేవలు అందిస్తున్నారు. సాక్షి నుంచి ఇలా
సీనియర్ జర్నలిస్ట్ గా ఆంధ్రప్రదేశ్ సలహాదారులుగా నియమితులయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో ఇప్పటికే గతం లో సాక్షి నుంచి సజ్జల
రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. జివిడి కృష్ణమోహన్, దేవులపల్లి
అమర్ సలహాదారులుగా సేవలు అందిస్తున్నారు. ఆర్. ఎం బాషా సమాచార హక్కు కమిషనర్
గా నియమితులయ్యారు. ఇప్పుడు నేమాని భాస్కర్ కు ఈ అవకాశం లభించింది.