మానవాళిని కబళిస్తున్న మలేరియా వ్యాధికి యాంటీబాడీ చికిత్స విధానాన్ని కనుగొన్నారు. 2020లో 6,20,000 కంటే ఎక్కువ మంది మలేరియాతో మరణించారు. వ్యాధికి మొత్తం 241 మిలియన్ల మంది ప్రభావితమయ్యారు. ఈ క్రమంలో ప్రధానంగా ఆఫ్రికాలో 5 ఏళ్లలోపు పిల్లల కోసం మొట్టమొదటిసారిగా లైసెన్స్ పొందిన మలేరియా టీకాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు. అయినప్పటికీ, ఇది 30శాతం సమర్థత రేటును మాత్రమే కలిగి ఉంది. నాలుగు మోతాదులు అవసరం వుంటుంది. ఆఫ్రికాలో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం.. దోమల ద్వారా సంక్రమించే మలేరియాకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఇటీవలి వ్యూహం ఈ పరిశోధనాత్మక ఔషధం. ఒకే ఇంజెక్షన్.. కనీసం ఆరు నెలల పాటు మలేరియా నుంచి మానవులను రక్షిస్తుంది.