విజయవాడ వేదికగా 26వ ఇంటర్ పాలిటెక్నిక్ స్సోర్స్ మీట్ ప్రారంభం
18 క్రీడాంశాలలో పోటీ పడుతున్న విధ్యార్ధులు
విజయవాడ : ప్రస్తుత పోటీ ప్రపంచంలో బహుముఖ ప్రతిభను కనబరిచినప్పుడే ఆశించిన
లక్ష్యాలను సాధించగలుగుతామని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి
అన్నారు. కేవలం విద్యకే పరిమితం కాకుండా క్రీడావిభాగంలో సైతం విద్యార్ధులు
తమదైన ప్రతిభను చూపాలన్నారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం
26వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను కమీషనర్
ప్రారంభించారు. అతిధ్య జట్టు నుండి క్రీడా జ్యోతిని స్వీకరించిన నాగరాణి,
శాంతి కపోతాలను ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమీషనర్
మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో క్రీడా
సౌకర్యాల పెంపుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్రీడలతో
విద్యార్ధులు మానసిక వత్తిడిని అధికమించి మరింతగా విద్యపై దృష్టి
నిలపగలుగుతారని చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. ఈ క్రీడా పోటీలలో కృష్ణా
రీజియన్ కు చెందిన 19 పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన 508 మంది క్రీడాకారులు తమ
సత్తా చాటేందుకు పోటీ పడుతున్నారు. మొత్తం 18 రకాల క్రీడాంశాలలో ఈ పోటీలు
జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్య, శిక్షణా మండలి కార్యదర్శి కెవి
రమణ బాబు, పంయిక్త కార్యదర్శి జానకిరామయ్య, ప్రాంతీయ సంయిక్త సంచాలకులు
జెఎస్ఎన్ మూర్తి, ఉప సంచాలకులు కె విజయభాస్కర్, ఎంఎవి రామకృష్ణ, కళాశాల
ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. విజయసారధి తదితరులు పాల్గొన్నారు.