పరిశీలించారు. టిడ్కో ఇళ్ళ ప్రాంతంలో నిషేధిత ప్రాంతం గా బోర్డు అక్కడ
ఉండడాన్ని పురంధేశ్వరి చూసి న తరువాత వెంటనే అక్కడ ఉన్న హౌసింగ్ అధికారిని
నిలదీశారు మీ ఉద్దేశ్యం ఏమిటి ఇలాంటి బోర్డు లు ఇక్కడ ఏర్పాటు చేయడం ఏంటి అంటూ
తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. టిడ్కో ఇళ్ళ కు సొమ్ము లు కట్టించుకుని టిడ్కో
ఇళ్ళను ఇవ్వక, కనీసం ఇల్లు కట్టుకోవడానికి జాగా ఇవ్వలేదని బాదితులు హౌసింగ్
అధికారి ముందు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి కి
ఫిర్యాదు చేయడం తో ఆమె చలించి పోయారు. పేదల పట్ల మీ నిర్వాకం ఇదా అంటూ వైసీపీ
ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు
దగ్గుబాటి పురంధేశ్వరి మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రజల పక్షాన
రాజీలేని పోరాటం బిజెపి మాత్రమే చేస్తోంది. పంచాయతీ ల నిధులు దగ్గర నుంచి
ఇసుక, లిక్కర్ మాఫియా పై కూడా పోరాటం బిజెపి మాత్రమే చేస్తోంది. కొందరు
పాత్రికేయులు అడిగి న ప్రశ్నలకు సమాధానం గా బెయిల్ పైన ఉన్న విజయసాయిరెడ్డి పై
చీఫ్ జస్టిస్ కు లిఖిత పూర్వకంగా తెలియ చేయడం జరిగింది. కార్యకర్తలు మనోభావాలు
తెలుసు కోవడం కోసం పర్యటన చేస్తున్నా. పార్టీ ని బలోపేతం చేయడం తో పాటు
రాజకీయ. అంశాల పై పార్టీ వైఖరిని ప్రజలకు వివరిస్తాం. 19జిల్లాలు పర్యటన
పూర్తి చేయడం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహకారం తో రాష్ట్రంలో
అభివృద్ధి.
ఎన్నికలకు సన్నద్దత కు సిద్దంగా ఉండాలి
అక్షర క్రమంలో నే కాదు అభివృద్ధి లో ముందుండాలని, కేంద్ర సహకారం తో మాత్రమే
అభివృద్ధి. ప్రతి జిల్లా లో కేంద్రం నుండి నిధులు విడుదల చేసి అభివృద్ధి చేయడం
జరిగింది. టిడ్కో ఇళ్ళ 2018లొ ప్రారంభం చేసి 2020 నాటికి పూర్తి చేయలేదు
ప్రస్తుతం ఇళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. రోడ్లుదారుణం గా ఉన్నాయి స్థానికులు
ఫిర్యాదు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. జగనన్న ఉయ్యాల జంపాల
మాదిరిగా రోడ్లు ఉన్నాయి . రాష్ట్రం లో ఎటు చూసినా అవినీతితో నిండిపోయింది.
తోటపల్లి రిజర్వాయర్. బ్యారేజ్ పనులు లేవు. నిర్వాసితులు ఆదుకోలేదు. జంజావతి
35 వేల ఎకరాల సాగు నీరు అందిస్తోంది అయితే ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు . ఏం
చేశారని ప్రశ్నించారు. పార్వతీపురం లో 16గిరిజన గ్రామాల అభివృద్ధి లేదు.
షెడ్యూల్ తెగల కు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది. ప్రాంతీయ విద్వేషం రగిల్చి
కులాల మధ్య విద్వేషం రెచ్చగొట్టే పని లో వైసీపీ ప్రభుత్వం ఉంది. పాత్రికేయుల
సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి,
జిల్లా బిజెపి అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీ నివాస్ ,మాజీ ఎంపీ కొత్తపల్లి
గీత, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు తదితరులు పాల్గొన్నారు.