2024 ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ విజయమే ధ్యేయం
నెల్లూరు టీడీపీ శ్రేణులకు పలు సూచనలు చేసిన మాజీ మంత్రి నారాయణ
నెల్లూరు : నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ
మంత్రి నారాయణ 49,50,51,52, 53,54 డివిజన్ స్థాయి ముఖ్యనేతలతో సోమవారం
సమావేశం నిర్వహించారు. నెల్లూరు పార్లమెంట్ జిల్లా టీడీపీ అధ్యక్షులు
అబ్దుల్ అజీజ్, రాష్ట్ర టీడీపీ ప్రధానకార్యదర్శి కోటంరెడ్డి
శ్రీనివాసులురెడ్డిలతో కలిసి ఆయన బాబు ష్యూరిటీ – భవిష్యత్‌కు
గ్యారెంటీ కార్యక్రమ పురోగతిపై చర్చించారు. పలు కీలక అంశాలతో టీడీపీ
శ్రేణులకు నారాయణ దిశానిర్దేశం చేశారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సమస్యల
పరిష్కారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త నిత్యం ప్రజల్లో ఉంటూ టీడీపీ
పథకాల గురించి చర్చిస్తుండాలన్నారు. ప్రధానం క్షేత్రస్థాయిలో టీడీపీ
శ్రేణులు తిరుగుతూ టీడీపీ ప్రభుత్వం గతంలో చేపట్టిన పథకాల లబ్ధిపై ఆరా
తీరాలని సూచించారు. ఇంకా పలు అంశాలపై ఆయన టీడీపీ శ్రేణులకు సూచనలు
చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ
రాష్ట్రాభివృద్ధి విజన్ ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యం
మేరకు టీడీపీ శ్రేణులు నిత్యం ప్రజల్లో ఉండాలన్నారు. బాబు ష్యూరిటీ –
భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం గురించి చర్చించి, ఓటర్ల
వెరిఫికేషన్‌లో భాగంగా దొంగ ఓట్లను వెలికితీయాలని సూచించారు. 2024లో
విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త శ్రమించాలని తెలియజేశారు. అనంతరం
నెల్లూరు పార్లమెంట్ జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ
టీడీపీ శ్రేణులకు ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందన్నారు. ఎప్పుడు ఏ
అవసరం వచ్చినా తమను సంప్రదించాలన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని
గెలిపించుకుని చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా, పొంగూరు నారాయణను
మంత్రిగా చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అజీజ్ ఘంటాపథంగా
చెప్పారు. తదనంతరం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి
శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ టీడీపీ శ్రేణులంతా కలిసి పని చేసి రానున్న
ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. టీడీపీ శ్రేణులకు
మాజీ మంత్రి నారాయణ అండదండ ఎల్లవేళలా ఉంటుందని, ఏ అవసరం వచ్చిన నేరుగా
సంప్రదించాలని సూచించారు. యువనేత నారా లోకేష్ నేతృత్వంలో విజయనగరంలో
జరిగే యువగళంపాద్రయాత్ర ముగింపు సభకు నెల్లూరు నుంచి భారీగా టీడీపీ
శ్రేణులు తరలివెళ్లేందుకు సన్నద్దమవుతున్నట్లు చెప్పారు. ఈ
కార్యక్రమంలో నగర మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి, నారాయణ విద్యాసంస్థల జిఎం
వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ డివిజన్ స్థాయి నేతలు,
ముఖ్యనాయకులు, తదితరులు పాల్గొన్నారు.