ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆరోగ్య సమస్యల్లో బోలు ఎముకల వ్యాధి ఒకటి. ఈ వ్యాధి నివారణ వ్యూహాలు, పద్ధతుల గురించి తెలుసుకుందాం.
హైడ్రాక్సీఅపటైట్ అని పిలువబడే ఒక నిర్మాణ భాగం, కొల్లాజెన్ ప్రొటీన్ ఎముకలను తయారు చేస్తాయి. హైడ్రాక్సీఅపటైట్ చిన్న కాల్షియం, ఫాస్పరస్ స్ఫటికాలతో తయారవుతుంది. ఎముక దృఢత్వానికిది దోహదపడుతుంది. కొల్లాజెన్ అనేది హైడ్రాక్సీఅపటైట్ స్ఫటికాలను కలిపి ఉంచి ఎముకకు బలాన్ని ఇచ్చే ప్రోటీన్ అణువు. అయినప్పటికీ, బోలు ఎముకల వ్యాధితో సహా అనేక వైద్య పరిస్థితులు ఎముక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని తేలింది.