కింజరాపు అచ్చెన్నాయుడు
గుంటూరు : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన
యువగళం పాదయాత్ర బహిరంగ సభను చరిత్రలో నిలుపుదామని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర
అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఒక్క అడుగుతో మొదలై యువత
ఆకాంక్షలకు, ఆశయాలకు నిలువుటద్దంగా నిలిచింది. 226 రోజులపాటు ప్రజలకు భరోసా
కల్పిస్తూ 3132 కిలో మీటర్లు విజయవంతంగా సాగింది. విజయనగరం జిల్లా పోలేపల్లిలో
నిర్వహిస్తున్న యువగలం – నవశకం సభను చారిత్రాత్మకంగా నిలుపుదాం. కార్యక్రమంలో
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు
పవన్ కళ్యాణ్ , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ,పార్టీ ముఖ్య నేతలు
కార్యకర్తలు హాజరు కానున్నట్లు
తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
[image: image.png]