నల్గొండ : తెలంగాణ రాష్ట్రం లో అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం
వచ్చిందని,ఇందిరమ్మ రాజ్యం లో ప్రజల ఆశలు,ఆలోచనల కనుగుణంగా అద్భుత పరిపాలన
అందిస్తామని,ప్రతి నిమిషాన్ని ప్రజల మంచి కోసం వినియోగిస్తామని
రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల,గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి
శ్రీనివాస రెడ్డి అన్నారు.
నకిరేకల్ శాసనసభ్యులుగా గెలుపొందిన వేముల వీరేశం గారి విజయోత్సవ ర్యాలీని
నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పోంగులేటి శ్రీనివాస్
రెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి
డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్
రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మెంబర్ చామల శ్రీనివాస్,
రాష్ట్ర నాయకులు దైద రవిందర్, బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల
శంభయ్య, నకిరేకల్ మండల యం.పి.పి బచ్చుపల్లి శ్రీదేవి-గంగాధర్, నియెజకవర్గ
వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు
సంక్రాంతి లోపు గృహ నిర్మాణ పాలసీ రూపొందించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ
కార్యక్రమం ప్రారంభిస్తామని ఆయన అన్నారు.ఇందిరమ్మ రాజ్యం లో సామాన్య ప్రజలకు
అందుబాటులో ఉంటామని,ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచు కుంటామని, కుటుంబాలలో
సభ్యుని గా, ఇందిరమ్మ పరిపాలన నిదర్శనంగా తీర్పు ఇచ్చిన ప్రజలకు పరిపాలన
అందిస్తామని అన్నారు.ప్రతి మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజల కష్టాలు
పరిష్కరిస్తామని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు చిత్తశుద్దితో పేద
వారి చెంతకు చేర్చే విధంగా అమలు చేస్తామని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఆరు గ్యారంటీ లలో రెండు గ్యారంటీ లు అమలు
చేశామని, పేద వారి కల నెరవేర్చే విధంగా చెప్పిన ప్రతి అంశం ప్రభుత్వం వంద శాతం
అమలు చేస్తుందని ఆయన అన్నారు. రాబోయే 15 రోజుల్లో డ్రగ్స్ మాఫియా ను తెలంగాణ
రాష్ట్రం నుంచి పారద్రోలే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని అన్నారు.