గుంటూరు : జాతీయ పంచాయతీరాజ్ ఛాంబర్ వ్యవస్థాపక అధ్యక్షులు వై వి బి
రాజేంద్రప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి
లక్ష్మీ ముత్యాలరావు పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్
ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య అధ్యక్షతన ఉమ్మడి గుంటూరు జిల్లా
సర్పంచ్ల సంఘం అధ్యక్షులు ఆదివారం పెదకూరపాడు నియోజకవర్గ సర్పంచుల కమిటీ
ఆధ్వర్యంలో చేపట్టిన సర్పంచుల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్
ఛాంబర్ అధికార ప్రతినిధి మేదరమెట్ల శివశంకర్ మరియు నియోజకవర్గ సర్పంచుల సంఘం
అధ్యక్షులు శ్రీ విట్టల్ రావు గారి పర్యవేక్షణలో పెదకూరపాడు నియోజకవర్గ
సర్పంచుల సమావేశం కొనసాగింది ఈ సందర్భంగా నియోజకవర్గము నలుమూలల నుండి మాజీ
ఎంపీపీలు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు మరియు ప్రస్తుత సర్పంచులు స్థానిక
సంస్థల ప్రజాప్రతినిధులు విరివిగా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో సర్పంచుల పలు సమస్యలు ప్రస్తావనకు రాగా వాటన్నింటిపై రాష్ట్ర
పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సుబ్బరామయ్య గారు మాట్లాడుతూ రాష్ట్ర
పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సర్పంచుల తరఫున
తాము చేస్తున్న పోరాటాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా
సర్పంచ్ సంఘం అధ్యక్షులు కల్లూరి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో
సర్పంచులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ త్వరలో మాజీ ముఖ్యమంత్రి ,
ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొనబోయే సమావేశానికి
పెదకూరపాడు నియోజకవర్గ నుంచి ప్రతి గ్రామం నుండి స్థానిక సంస్థల ప్రజా
ప్రతినిధులు అందరూ పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేసి సర్పంచుల సమస్యల మీద
దళం ఇవ్వాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు సర్పంచ్
రాజు, పొడపాడు సర్పంచ్ రూపా లక్ష్మీ, కొత్తపల్లి సర్పంచ్ అయ్యప్ప రాజు ,
లింగం గుంట్ల సర్పంచ్ వెంకటేశ్వర్లు , బెల్లంకొండ సర్పంచ్ గడిపర్తి జ్యోతి ,
వైకుంటపురం ఎంపీటీసీ కే రాజు, గారపాడు సర్పంచ్ మేడ రమణ, నాగారం సర్పంచ్
వెంకటేశ్వర్లు , నాగారం ఎంపీటీసీ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.