సీఎం జగన్‌రెడ్డి మహిళలను మోసం చేశాడు
కాపులకు గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తాం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
విశాఖపట్నం : మూడు ముక్కలాటతో ప్రజా రాజధాని అమరావతిని ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన
కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి
నేటితో నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా లోకేశ్ ట్వీట్ చేశారు. జగన్ విధ్వంసం
ఆరంభించి నాలుగేళ్లు పూర్తయ్యాయి. రూ.వేల కోట్ల విలువైన భవనాలను శిథిలం
చేశారు. భూములు ఇచ్చిన రైతులను హింసించారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు ధ్వంసం
చేయించారు. జగన్ అరాచక పాలన మూడు నెలల్లో ముగిసిపోతుంది. ప్రజా రాజధాని
అమరావతి అజరామరమై నిలుస్తుందని లోకేశ్ పేర్కొన్నారు.
సీఎం జగన్‌రెడ్డి మహిళలను మోసం చేశాడు : జగన్ అధికారంలోకి రావడానికి చాలా
హామీలు ఇచ్చి మహిళలను మోసం చేశాడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా
లోకేష్ తెలిపారు. ఆదివారం నాడు పెందుర్తి నియోజకవర్గం పరవాడలో నారా లోకేష్‌ని
డ్వాక్రా మహిళలు, కాపు సామాజికవర్గీయులు కలిశారు. ఈ సందర్భంగా లోకేష్
మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ల విషయంలో మాటతప్పి మడమతిప్పాడు. కాపు రిజర్వేషన్ల
విషయంలో గతంలో అసెంబ్లీలో చేసిన తీర్మానానికి, టీడీపీ కట్టుబడి ఉంది. కాపులకు
గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ 229 అమలు చేస్తాం : తెలుగుదేశం పార్టీ
అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ 229 అమలు చేస్తామని టీడీపీ పార్టీ జాతీయ
ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆదివారం పరవాడ సంతబయలు వద్ద
పంచగ్రామల ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నారా లోకేష్
పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ పంచగ్రామాల ప్రజలు పడుతున్న
బాధలు నాకు తెలుసు. ఈ సమస్య పై నాకు పూర్తి అవగాహన ఉంది. 12 వేల ఎకరాలు, 18
వేల ఇళ్లకు సంబంధించిన సమస్య ఇది. లక్ష మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
పిల్లల పెళ్లిళ్లు, చదువులు, వైద్యం, ఇతర అవసరాల కోసం ఆస్తులు అమ్ముకునే హక్కు
లేకుండా పోయింది. కనీసం ఇంటి రిపేర్లు చేసుకునే పరిస్థితి లేదు. ఈ సమస్య
పరిష్కారానికి కృషి చేసింది చంద్రబాబు. జీఓ 578 తీసుకొచ్చి రెగ్యూలరైజ్
చేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించింది.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి డబ్బులు
కట్టోద్దు. నేను వచ్చి ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తానని చెప్పారు. కానీ
అధికారంలోకి వచ్చిన తర్వాత కమిటీ వేసి సమస్యను మరింత జఠిలం చేశారు. ఈ సమస్య
పరిష్కారానికి చంద్రబాబు ప్రయత్నం చేశారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు
పంచగ్రామాల సమస్య పరిష్కారానికి కృషి చేశారని నారా లోకేష్ తెలిపారు.
జీఓ 229 అమలు కాకుండా వైసీపీ కాలక్షేపం : ‘‘వైసీపీ లీగల్ సెల్లో పనిచేసే
వారు కోర్టుకి వెళ్లి జీఓ 229 అమలు కాకుండా చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే
నెలలో సమస్య పరిష్కారిస్తానని పాదయాత్ర సమయంలో జగన్‌రెడ్డి హామీ ఇచ్చాడు.
బిల్డప్ బాబాయ్ అదీప్ రాజ్ ఎమ్మెల్యే అయిన వెంటనే సమస్య పరిష్కారం చేస్తానని
చెప్పి చెతులేత్తేశాడు. నాలుగున్నరేళ్లుగా కమిటీ పేరుతో వైసీపీ ప్రభుత్వం
కాలక్షేపం చేసింది. ఈ జీవోపై ఒక్క అడుగు ముందుకు వెళ్లలేదు. సమస్య
పరిష్కారానికి కృషి చేసింది టీడీపీ. సమస్య పరిష్కారం కాకుండా అడ్డుకుంది
వైసీపీ. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. ఇళ్ల
సమస్యతో పాటు రైతుల సమస్యను కూడా పరిష్కరిస్తాం. టీడీపీ హయాంలో ఇళ్లు రిపేర్లు
చేసుకోవడానికి అవకాశం ఇచ్చాం. వైసీపీ ప్రభుత్వం కనీసం రిపేర్లు కూడా చేయలేదని
నారా లోకేష్ పేర్కొన్నారు.