బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలి
ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ మారేష్
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో హోటల్ ఐలాపురం కన్వెన్షన్
సెంటర్లో బీసీ మేధావుల సమావేశం జరిగినది. ఈ సమావేశంలో విజయవాడ పార్లమెంటరీ
పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుండి దాదాపు 30 పైగా కుల సంఘాలు పాల్గొని
చర్చించి ఏక వాక్య తీర్మానంగా విజయవాడ ఎంపీ సీటు బీసీలకు కేటాయించాలని కోరారు.
ఈ సమావేశానికి సభా అధ్యక్షత వహించిన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్
మారేష్ మాట్లాడుతూ
రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీల అధ్యక్షులకు వైయస్ జగన్మోహన్ రెడ్డి కి,
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిజెపి పార్టీ
అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున విజయవాడ
పార్లమెంటు చరిత్రను పరిశీలించి బీసీలకు విజయవాడ ఎంపీ సీటు కేటాయించాలని
విజ్ఞప్తి చేస్తున్నాం. 1952 నుండి 2019 వరకు 17 సార్లు పార్లమెంటుకు
ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా బీసీకి అవకాశం రాకపోవడం దురదృష్టకరం. దాదాపు
70 సంవత్సరాలు పైగా ఒకే సామాజిక వర్గం చేతిలో విజయవాడ ఎంపీ సీటు ఉండడం
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రస్తుతం విజయవాడ పార్లమెంటు
పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే రెండు నియోజకవర్గాలు రిజర్వ్ ఉండగా
మిగతా ఐదు నియోజకవర్గాల్లో ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేకపోవడం దురదృష్టకరమని
పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో 16 లక్షల జనాభా ఉంటే దానిలో 8 లక్షల
పైగా మైనార్టీలతో కలుపుకొని బీసీలు ఉన్నారని, ఎస్సీ ఎస్టీ సోదరులు 4 లక్షలు
ఉన్నారు కాపు సోదరులు రెండు లక్షలు ఉన్నారు మొత్తం జనాభాగా 14 లక్షలు కలిగి
ఉన్నారని చెప్పారు. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కాపు సోదరులు
మద్దతు కూడగట్టామని, రాబోయే రోజుల్లో విస్తృత స్థాయిలో బీసీ సమావేశాలు ఏర్పాటు
చేయనున్నట్లు చెప్పారు. రాబోయే సమావేశం తిరువూరు నియోజకవర్గంలో
నిర్వహించనున్నామని, నూటికి నూరు శాతం బెజవాడ గడ్డ బీసీల అడ్డా అని వచ్చే
ఎన్నికల్లో నిరూపించబోతున్నామని తెలియజేస్తున్నాం. రాజకీయాలకు కేంద్ర బిందువు
రాజకీయ చైతన్యానికి మారుపేరు విజయవాడ పార్లమెంటు స్థానాన్ని బీసీలకు
కేటాయించాలని అన్ని పార్టీలను కోరుతున్నామన్నారు. బీసీలను ఓట్లు వేసే
యంత్రాలు లాగా చూడకుండా రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలని కోరుతున్నాం. విజయవాడ
పార్లమెంటు పరిధిలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు సోదరుల సమస్యలు
పరిష్కరించబడాలంటే విజయవాడ ఎంపీగా బీసీలకు అవకాశం ఇవ్వాలని కోరారు. విజయవాడ
సీటు బీసీకి కేటాయించాలని డిమాండును ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో బలంగా
తీసుకెళ్తామని తెలియజేస్తూ దీనికి మీడియా సహాయ సహకారాలు కావాలని కోరుతున్నాం
ఇటీవల విజయవాడ పార్లమెంట్ చరిత్రకు సంబంధించి నా వాస్తవాలను రణరంగం అనే
ప్రోగ్రాం ద్వారా వివరించిన టీవీ9 కు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరపున ప్రత్యేక
ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో మిగతా మీడియా సంస్థలు , ప్రింట్ మీడియా
సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘానికి కావాలని కోరారు. ఎట్టి
పరిస్థితుల్లో విజయవాడ ఎంపీ సీటు బీసీలకు కేటాయించే వరకు ఆంధ్రప్రదేశ్ బీసీ
సంఘం దీనిని ఒక ఉద్యమం లాగా ఏడు నియోజకవర్గాల్లో నడిపిస్తామన్నారు. ఈ
కార్యక్రమంలో టి అర్జున్ రావు, వేముల బేబీ రాణి, ఈతాకులు జగదీష్, మోర్ల
మహిధర్, బెజవాడ గణేష్, జక్కా శ్రీనివాసరావు, పంతగాని రమేష్, శివ, వేములకొండ
సుబ్బారావు, కోమటి కోటేశ్వరరావు, మచ్చు నాగేంద్ర, కోసూరు నరేష్, విజయవాడ
పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజక వర్గాల నుండి 40 పైగా కుల సంఘాల నాయకులు
పాల్గొన్నారు.