జమ్మూకశ్మీర్లో రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఎన్ కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లా ఖాందిపోరాలో ముగ్గురు, అనంతనాగ్ జిల్లా సెంథన్లో ఒకరు భద్రతాబలగాల కాల్పులో మృతి చెందినట్లు పేర్కొన్నారు. లష్కరే తోయిబాకు చెందిన మరో ముగ్గురు హైబ్రిడ్ ఉగ్రవాదులను శ్రీనగర్, బుడ్గామ్ జిల్లాల్లో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. భద్రతా బలగాలకు పుల్వామా ఎన్ కౌంటర్ చాలా పెద్ద విజయమని కశ్మీర్ పోలీసు విభాగం ఏడీజీపీ విజయ్ కుమార్ ట్విటర్లో అభిప్రాయప డ్డారు. ఆదేశాలు వచ్చినప్పుడు దాడులకు పాల్పడి అనంతరం జనంలో కలిసిపో తున్న ఉగ్రవాదులను అధికారులు హైబ్రిడ్ ఉగ్రవాదులుగా వ్యవహరిస్తున్నారు.