హైదరాబాద్: ఉద్యమకారులపై లాఠీచార్జి చేయలేనంటూ డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన
మాజీ అధికారిణి నళిని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తనపై సీఎం చూపించిన
అభిమానానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఆత్మీయత తన హృదయానికి గొప్ప స్వాంతన
కలిగించిందని, తన కళ్లు చెమ్మగిల్లుతున్నాయంటూ భావోద్వేగంతో ఈ లేఖ రాశారు.
తనకు న్యాయం చేయాలనుకుంటే ఉద్యోగానికి బదులు తన ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా
సహాయం చేస్తే స్వీకరిస్తానని ఆమె చెప్పారు. తన గతం ఒక రీల్ మాదిరిగా కళ్ల
ముందు కదులుతోందని ఆమె గుర్తుచేసుకున్నారు. కాగా ప్రస్తుతం నళిని తెలంగాణ
ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఉద్యమకారులపై లాఠీఛార్జ్ చేయలేనంటూ తన
డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర విజభన జరిగి దాదాపు
తొమ్మిదిన్నరేళ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు ఆమె ప్రస్తావనే రాలేదు. గత
ప్రభుత్వం ఆమె త్యాగాన్ని గుర్తించలేదు. అయితే ఆమె ప్రస్తుతం ఆధ్యాత్మిక
మార్గంలో నడుస్తున్నారు. యజ్ఞ బ్రహ్మగా, వేద ప్రచారకురాలిగా మారారు. కాగా
ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే నళిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ
సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. తాజాగా పోలీస్ శాఖ సమీక్ష
సందర్భంగా నళినిని రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆమెకు ఆసక్తి
ఉంటే వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఒకవేళ ఆమెకు అదే పోస్టు ఇవ్వడానికి
పోలీసుశాఖ నిబంధనలు అడ్డు వస్తే అదే హోదాతో వేరే శాఖలో ఇవ్వాలని ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి, డీపీజీలకు సీఎం రేవంత్ సూచించిన విషయం తెలిసిందే