అధికారంలోకి వచ్చాక బీసీలకు రక్షణ చట్టం తెస్తాం
అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను జగన్ గాలికొదిలేశారు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేశ్
3100 కి.మీ. మైలురాయికి చేరుకున్న యువగళం
చోడవరం-అనకాపల్లి మధ్య రైల్వేబ్రిడ్జి పూర్తిచేస్తామని హామీ
ఎలమంచిలి : ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చాక బీసీ సబ్‌ప్లాన్ నిధులను
దారి మళ్లించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేశ్ ఆరోపించారు.
ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో 224వ రోజు యువగళం పాదయాత్ర
కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా అరబుపాలెంలో బీసీల నాయకులు, అనకాపల్లిలోని
బెల్లం తయారీదారులు, గంగాదేవిపేటలో రైతులతో లోకేశ్ సమావేశమయ్యారు.
బీసీలపై 26 వేల అక్రమ కేసులు పెట్టారు : ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘బీసీలపై
జగన్ ప్రభుత్వం 26 వేల అక్రమ కేసులు పెట్టింది. మేం అధికారంలోకి వచ్చాక
బీసీలకు రక్షణ చట్టం తెస్తాం. ప్రభుత్వ పెద్దల అండతోనే రాష్ట్రంలో గంజాయి సాగు
జోరుగా సాగుతోంది. తెదేపా-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్ల బెల్లంపై
ఆంక్షలు తొలగిస్తాం. చెరకు రైతులకు ప్రభుత్వం తరఫున సహకారం అందించి ఆదుకుంటాం.
వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షభంలో కూరుకుపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్
కాల్వల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. అధికారంలోకి రాగానే శారద కాల్వ
పూడిక తీయిస్తాం. కాల్వలో నీరు కలుషితం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు
తీసుకుంటామని చెప్పారు.
మంత్రుల వ్యాఖ్యలు దుర్మార్గం : మునగపాకలో అంగన్వాడీల శిబిరానికి వెళ్లిన
లోకేశ్ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ
ఇచ్చారు. ‘‘బెదిరింపు వ్యాఖ్యలు జగన్ నియంతృత్వ పోకడలకు నిదర్శనం.
వాలంటీర్లతో నడిపించుకుంటామని మంత్రులు చెప్పడం దుర్మార్గం. అంగన్వాడీలకు
జగన్ ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. అంగన్వాడీల న్యాయ పోరాటానికి తెదేపా
అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు.
3100 కి.మీ. మైలురాయికి చేరుకున్న యువగళం : జనగళమే యువగళమై మహా ప్రభంజనంలా
సాగుతున్న యువగళం పాదయాత్ర అనకాపల్లి పట్టణం గౌరీ గ్రంథాలయం వద్ద 3100 కి.మీ.ల
మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చాక చోడవరం-అనకాపల్లి మధ్య
రైల్వే బ్రిడ్జిని పూర్తిచేస్తామని హామీ ఇస్తూ శిలా ఫలకాన్ని ఆవిష్కరించాను.
దీనివల్ల అనకాపల్లి, పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ట్రాఫిక్ కష్టాల
నుంచి విముక్తి లభిస్తుందని నారా లోకేష్ పేర్కొన్నారు.
అనకాపల్లి నుంచి టిడిపిలోకి భారీగా వలసలు : యువనేత నారా లోకేష్ చేపట్టిన
యువగళం పాదయాత్ర అనకాపల్లి నియోజకవర్గంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అనకాపల్లి
నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు ఆ పార్టీకి
షాక్ ఇచ్చారు. జీవీఎంసీ 82వ వార్డులో నారా లోకేష్ యువగళం క్యాంప్ సైట్ లో
గొలగం ఎంపీటీసీ, సర్పంచ్ చంద్రశేఖర్, అక్కిరెడ్డి వెంకటరమణ, పాడేరు
నియోజకవర్గం లగిసపల్లికి సర్పంచ్ పార్వతమ్మ శనివారం టీడీపీలో చేరారు. వీరితో
పాటు అనకాపల్లికి చెందిన పలువురు వార్డు మెంబర్లు, మిల్క్ సొసైటీ సభ్యులు కూడా
టీడీపీలో చేరారు. వీరందరికీ నారా లోకేష్ టీడీపీ కండువా కప్పి సాదరంగా
పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక
సంస్థలను నిర్వీర్యం చేసిందని, సర్పంచులను ఉత్సవ విగ్రహంలా ప్రభుత్వం
మార్చిందని సర్పంచులు, ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం లోకేష్
మాట్లాడుతూ పంచాయతీలకు మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామని, పంచాయతీల నిధులు
గ్రామాలాభివృద్ధికే ఖర్చు చేస్తామన్నారు. ఇప్పటికీ వెయ్యికోట్లకు పైగా
పంచాయతీల ఖాతాల నుండి విద్యుత్ బకాయిల పేరుతో లాక్కున్న జగన్ రెడ్డి ప్రభుత్వం
ఖాతాల్లో ఉన్న మరో రూ.250 కోట్లు కూడా లాగేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
మీ నియోజకవర్గాల్లో టీడీపీని అధికమెజారిటీతో గెలిపించాలని లోకేష్ కోరారు.
లోకేష్ ను కలిసిన అనకాపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు : అనకాపల్లి
ముప్పన సిల్క్స్ వద్ద అనకాపల్లి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సంక్షేమ
సంఘం ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మేమంతా
మధ్యతరగతి వ్యాపారస్తులం. లీగల్ మెట్రాలజీ, ఫుడ్ లైసెన్స్, జీఎస్టీ లైసెన్స్,
లేబర్ లైసెన్స్, పెస్టిసైడ్స్ లైసెన్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ట్రేడ్
లైసెన్స్, మున్సిపల్ ట్యాక్స్, మున్సిపల్ ఆశీలు కడుతున్నాం. కిరాణా, ఫ్యాన్సీ,
బంగారం, చెప్పులు, వస్త్రాలు వ్యాపారాలు చేసే వాళ్లంతా ఈ ఆశీలు కడుతున్నాం. మా
నుండి రాష్ట్ర ఖజానాకు పెద్దమొత్తంలో డబ్బులు సమకూరుతున్నాయి. మా వ్యాపారాల
ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాం. ప్రభుత్వం మాకు ఎలాంటి సహాయ,సహకారాలు
అందించకపోగా మమ్మల్ని వేధిస్తోంది. సింగిల్ విండో విధానంలో మొత్తం లైసెన్సులు
వచ్చేలా చర్యలు తీసుకోవాలి. మాకు ఆరోగ్య బీమా, ఆరోగ్యశ్రీ వర్తింపజేసి ఆరోగ్య
భద్రత కల్పించాలి. ట్యాక్స్ కట్టేవారికి ప్రత్యేకమైన కార్డులిచ్చి కార్డు
ఉన్నవారికి రాయితీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
నారా లోకేష్ స్పందిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జె-ట్యాక్స్ విధానాల
కారణంగా రాష్ట్రంలో అన్నిరకాల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వివిధ పన్నులు చెల్లిస్తూ రాష్ట్రాభివృద్ధికి సహకరించే వ్యాపారులను ప్రభుత్వం
వేధించడం దారుణం. టిడిపి అధికారంలోకి వచ్చాక సింగిల్ విండో విధానం ద్వారా
లైసెన్సులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. వ్యాపారులపై ఎటువంటి వేధింపులు లేకుండా
స్వేచ్చాయుత వాతావరణంలో తమ కార్యకలాపాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటాం.
వ్యాపారులకు తక్కువ ప్రీమియంపై ఆరోగ్య బీమా అమలుచేసేలా చర్యలు తీసుకుంటాం.
వ్యాపార సంస్థల్లో పనిచేసే కార్మికులకు నిబంధనలకు లోబడి ఆరోగ్యశ్రీ
అమలుచేస్తామని హామీ ఇచ్చారు.