తాడేపల్లిగూడెం : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రపంచ తెలుగు
సాహిత్య కళా ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి
డాక్టర్ తానేటి వనిత హాజరయ్యారు. శనివారం స్థానిక బుద్దాల కన్వెన్షన్ హాల్
వద్ద ఆమె జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి
వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధికి జగనన్న ప్రభుత్వం కృషి
చేస్తుందన్నారు. తెలుగు సాహిత్య, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.
‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని హోంమంత్రి తానేటి వనిత గుర్తు చేశారు. ఈ
కార్యక్రమానికి శ్రీశ్రీ కళావేదిక తెలుగు సాహిత్య అంతర్జాతీయ చైర్మన్
కత్తిమండ ప్రతాప్, ఆంధ్ర రాష్ట్ర సాహితీ అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగోళ్ల
శ్రీలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, శ్రీ శ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్
కొల్లి రమావతి పాల్గొన్నారు. కళావేదిక అధ్వర్యంలోప్రపంచ తెలుగు సాహిత్య కళా
ఉత్సవాలు – తెలుగు భాష సాంస్కృతిక ప్రదర్శనలు లో భాగంగా వివిధ కళాకారులతో
నిర్వహించిన ర్యాలీలో వాణీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు తెలుగుతనం
ఉట్టిపడేటట్లుగా తెలుగు తల్లి, భరతమాత, రాణి రుద్రమదేవి, మొల్ల, కవిత్రయం
నన్నయ, తిక్కన, ఎర్రన వంటి కవుల వేషధారణలతో పాల్గొనడం పట్టణంలోని పలువురి
ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.