చేస్తాడని, రూ.85 కోట్లతో పలాసలో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్
సెంటర్,200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించిన సందర్భంగా రాజ్యసభ
సభ్యులు,వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యాలు
చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. కిడ్నీ
సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తూ రూ. 700 కోట్ల తో నిర్మించిన
వైయస్సార్ సుజలధార ప్రాజెక్టును కంచిలి మండలం మార్కాపురంలో సీఎం జగన్
ప్రారంభించి వాస్తవ రూపంలోకి తీసుకోస్తే, గత చంద్రబాబునాయుడు పాలన అన్ని
విషయాలలో గ్రాఫిక్స్ కే పరిమితం అయిందన్నారు..
ఆరోగ్యశ్రీ చికిత్స వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రజారోగ్య పరిరక్షణలో మరో విప్లవాత్మక నిర్ణయానికి రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్
సిగ్నల్ లభించిందని చెప్పారు. పేద కుటుంబాలకు పునర్జన్మ ప్రసాదిస్తున్న అపర
సంజీవిని వైయస్సార్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితి ఏకంగా రూ. 25 లక్షలకు
పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు..
దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో కార్పొరేట్ వైద్యాన్ని
అందించడంతోపాటు, ప్రైవేట్ ఆసుపత్రిలోనూ అధునాతన వైద్య సేవలు పొందేలా
ఆరోగ్యశ్రీ పధకాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బలోపేతం చేయడం రాష్ట్ర ప్రజలకు
తెలిసిందేనని విజయసాయిరెడ్డి అన్నారు.
[image: image.png]