ఏలూరు : జనసేనతో తమ పొత్తు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి
పురందేశ్వరి స్పష్టం చేశారు. తమతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు జనసేన ఎక్కడా
చెప్పలేదన్నారు. పొత్తులు బీజేపీ కేంద్ర నాయకత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో ఆమె పర్యటించారు. అనంతరం దండమూడిలో జిల్లా
కార్యకర్త సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాజధాని అమరావతికి కేంద్రం నిధులు
ఇచ్చింది. పార్లమెంటు సాక్షిగా అమరావతే ఏపీ రాజధాని అని కేంద్ర ప్రభుత్వం
ప్రకటించింది. కేంద్ర ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా సాగుతోంది. త్వరలో పోలవరం
ప్రాజెక్టున సందర్శిస్తాను. పోలవరం నిర్మాణానికి ప్రతి పైసా కేంద్రమే
భరిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా పార్టీని సన్నద్ధం
చేస్తున్నాం. దొంగ ఓట్లపై మేము కూడా పోరాడుతున్నాం. నకిలీ ఐడీలు సృష్టించి
ఓట్లు నమోదు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా ఈ విషయాన్ని
తీసుకువెళ్లాం. ఏలూరు జిల్లాకే పీఎం ఆవాస యోజన కింద లక్ష ఇళ్లు కేటాయించాం.
వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇళ్లు నిర్మించిందో శ్వేతపత్రం ఇవ్వాలి. రాష్ట్రంలో
విధ్వంసక పాలన చూస్తున్నాం. ఆడుదాం ఆంధ్రా కాదు. వైసీపీ నేతలు ఆంధ్రతో
ఆడుకుంటున్నారు. ప్రతి పైసా తమ జేబుల్లోకి వెళ్లాలనేది వైసీపీ ఆలోచన.
రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాని పరిస్థితి.. అడిగితే కేసులు, వేధింపులు.
తుపాను కారణంగా పొగాకు పంటలు బాగా దెబ్బతిన్నాయి. స్వయం ఉపాధి రుణాలను సైతం
దారి మళ్లించారు. రాష్ట్రంలో బీసీ డిక్లరేషన్‌కు చట్టబద్ధత లేదు. రాష్ట్రానికి
ఏ విధంగానూ న్యాయం చేయని వైసీపీ ఏపీకి అవసరమా?’’ అని పురందేశ్వరి ప్రశ్నించారు.
[image: image.png]