హైదరాబాద్ : పోలీసు నియామక పక్రియను వెంటనే చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీసు, వైద్యారోగ్య శాఖల్లో నియామకాలపై
శుక్రవారం డా.బీ.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని
నిర్వహించారు. ఉద్యోగ నియామకాలను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు
ఆస్కారం లేకుండా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నియామకాల
ప్రక్రియలో ఉన్న లోటు పాట్లు, వాటిని అధిగమించే అంశాలపై సవివరమైన నివేదిక
ఇవ్వాలని అధికారులను కోరారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి
వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలని అడిగారు. సాధ్యమైనంత
త్వరగా పోలీసు ఉద్యోగ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి
కుమారి, డీజీపీ రవి గుప్తా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాస
రావు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎ.ఎం. రిజ్వి, సీఎంవో అధికారులు
శివధర్ రెడ్డి, శేషాద్రి, షా-నవాజ్ కాసీం, ఆర్థిక శాఖా కార్యదర్శి శ్రీదేవి,
నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
[image: image.png]