ప్రారంభించిన పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్య కమీషనర్ ఎస్.సురేష్ కుమార్
విజయవాడ : రాష్ట్రంలో మొదటి దశలో 1000 పాఠశాలలను సీబీఎస్ఈ సిలబస్ అనుసంధానం చేశామని, పాఠశాలల్లో సీబీఎస్ఈ సక్రమంగా అమలు చేయడానికి, విధాన పరమైన సమస్యలు వస్తే పరిష్కార దిశగా బోర్డు సహకరించాలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. గురువారం విజయవాడలోని గవర్నర్ పేటలో సీబీఎస్ఈ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్, సీబీఎస్ఈ రీజనల్ ఆఫీసర్ శేఖర్ చంద్ర, డా. సాన్యం భరద్వాజ్ (కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్), సీబీఎస్ఈ, మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ ఎం.వి. కృష్ణారెడ్డి, వి.అరుణ (హెడ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్) తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది సీబీఎస్ఈ ప్రాంతీయ కార్యాలయం ఇబ్రహీంపట్నంలో ఉండేది. ఇక నుండి ‘సీబీఎస్ఈ ప్రాంతీయ కార్యాలయం, గవర్నర్ పేట, స్టాలిన్ సెంట్రల్, 2,3 అంతస్థులు, ఎంజీరోడ్, గవర్నర్ పేట, విజయవాడ, ఆంధ్రప్రదేశ్- 520002’ చిరునామాలో సేవలందించనుంది.