మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలోని జైసీనగర్ పోలీస్ స్టేషన్లో దొంగత కేసులో అరెస్టయిన 19 ఏళ్ల యువకుడు పోలీస్ కస్టడీలో మంగళవారం మరణించాడు. ఆ యువకుడిని జిల్లాలోని సెమ్రా గోపాల్మన్ కుగ్రామానికి చెందిన కృతేష్ పటేల్‌గా గుర్తించారు. అయితే పోలీసులు, యువతి కుటుంబీకులు కొట్టడంతో యువకుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. “నా కుమారుడి ఆరోగ్యం బాగానే ఉంది. అతనికి ఎలాంటి అనారోగ్యాలు లేవు. అతడిని అమ్మాయి కుటుంబం మరియు పోలీసులు కొట్టారు” అని కృతేష్ తండ్రి రాజు పటేల్ అన్నారు.