విజయవాడ : దేశంలో మతతత్వ శక్తులను ఓడించేందుకు వామపక్షాల ఐక్య కార్యాచరణ తక్షణ అవసరమని యంయల్ పిఐ(రెడ్ ఫ్లాగ్) జాతీయ ప్రధానకార్యదర్శి యంయస్ జయకుమార్ ఉద్ఘాటించారు. సౌహార్ధ సందేశాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస్ రావు, సిపిఐ(యంయల్) కేంద్ర కమిటీ సభ్యులు గుర్రం విజయ్ కుమార్, రివల్యూషనరీ ఇన్షియేటీవ్ కేంద్ర కమిటీ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాకూర్, యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి యం.వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశం ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి వామపక్షాల ఐక్య కార్యాచరణ తక్షణ అవసరమని వ్యాఖ్యానించారు. సభకు జాతీయ కార్యవర్గ సభ్యులు థామస్ ఫ్రెడ్ఢీ అధ్యక్షుడుగా వ్యవహరించారు. తొలుత కేంద్ర కమిటీ కార్యవర్గ సభ్యులు బసవలింగప్ప ఆహ్వానం పలికారు. తొలుత ఎర్రజెండా ఆవిష్కరించారు. అమర కళకారుల బృందం డోలక్ యాదగిరి విప్లవ పాటలతో మహాసభలు ఉత్సాహాపూరిత వాతావరణంలో ప్రారంభమైనాయి. మహాసభలను రాష్ట్ర కార్యదర్శి మరీదు ప్రసాద్ బాబు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.