పత్రికా రంగంనుంచి సీనియర్ జర్నలిస్డు నిమ్మరాజు’కు పురస్కారం
తెనాలి : ప్రముఖ సినీనటి, నర్తకి మంజుభార్గవికి జీవన సాఫల్య పురస్కారం అందజేయనున్నారు. ఈ సందర్భంగా పత్రికా రంగంనుంచి సీనియర్ జర్నలిస్డు నిమ్మరాజు’కు సత్కారం చేయనున్నారు. అలాగే వివిధ రంగాలలో సేవలు అందించిన విశేష వ్యక్తులకు కూడా తెనాలిలో జరిగే స్వరాలయ వేదిక వారినందరినీ సత్కరించనున్నట్లు స్వరాలయ వేదిక వ్యవస్థాపకులు లక్కరాజు వెల్లడించారు. ఈనెల 16న శనివారం సాయంత్రం ఐదుగంటలకు తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో స్వరాలయ వేదిక రజతోత్సవాలు జరుగనున్నయని సంస్థ వ్యవస్థాపక్షులు సాయిలక్కరాజు మీడియా తెలిపారు . తమ 500వ కార్యకమం సందర్భంగా ప్రముఖ సినీనటి, నర్తకి మంజు భార్గవికి 2023- జీవన సాఫల్య పురస్కారం ఇవ్వనున్నట్లు నిర్వాకులు తెలిపారు. అలాగే పత్రికా రంగంలో ఉంటూ విశిష్టమైన సేవలను సమాజానికి అందిస్తున్న సీనియర్ జర్నలిస్టు నిమ్మ రాజు చలపతిరావును కూడా ఘనంగా సన్మానించనున్నారు. సంగీత రంగంలో చింతలపాటి మంజులత పురస్కారాలు : అలాగే వివిధరంగాలకు చెందిన ఎం. సత్యవర్థన్ లలిత, ఎం సైదులు తదితరులు ఆత్మీయ పురస్కారాలను అందుకోబోతున్నారు. ఈ కార్యక్రమంలో లలితి సంగీతం భక్తి సంగీత కచేరీలు జానపద కూచిపూడి భరతనాట్య ప్రదర్శనలు, పద్య గానం, వచనకవిత్వం,తెలుగు గజళ్లు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు లక్కరాజు, సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా స్థానిక శాసనసభ్యులు అన్నా బత్తుని శివ కుమార్, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, మాజీ మంత్రి మండల బుద్ధ ప్రసాద్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, మాజీ శాసనసభ్యులు ఉమ తదితరులు హాజరుకానున్నారు.