బంగ్లాదేశ్‌లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చే ఉగ్రవాద ఇస్లామిస్ట్ పార్టీ బంగ్లాదేశ్ జమాత్-ఎ-ఇస్లామీ కొత్త పేరుతో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తోందాని బంగ్లాదేశ్ లైవ్ న్యూస్ పేర్కొంది. ఆ దేశ 12వ జాతీయ ఎన్నికలు 2023 చివరి నాటికి జరుగనున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లోని అన్ని ప్రధాన పార్టీలు పోటీలకు సిద్ధమవుతున్నాయి. బంగ్లాదేశ్ లైవ్ న్యూస్ ప్రకారం… బంగ్లాదేశ్ జమాత్-ఇ-ఇస్లామీ బంగ్లాదేశ్ స్వాతంత్ర్యాన్ని వ్యతిరేకించడం, 1971 లిబరేషన్ వార్ సమయంలో పాకిస్తాన్ సైన్యంతో పక్షపాతం వహించడం వంటి వివాదాలతో అపఖ్యాతి పాలైంది. ఈ తరుణంలో ఆ పార్టీ ఎన్నికల్లో పాల్గొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.