హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్లో జరిగన ఘటన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు, మండలి ఛైర్మన్, ప్రొటెం స్పీకర్, పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలకు మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ఇప్పటివరకు జారీ చేసిన పాసులు తప్ప అన్నింటినీ నిలిపివేయాలని ప్రొటెం స్పీకర్ ఆదేశించారు.